సర్వర్ డౌన్ రిజిస్ట్రేషన్లకు బ్రేక్
సర్వర్‌లో సాంకేతిక సమస్యలు రిజిస్ట్రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
- యూఐడీఏఐలో సాంకేతిక సమస్య
- బోసిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
- పొద్దంతా నిరీక్షించిన జనం
దోమకొండ/ఖలీల్‌వాడి, జూలై 11: సర్వర్‌లో సాంకేతిక సమస్యలు రిజిస్ట్రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్ సర్వర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సర్వర్ వచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్‌కి వచ్చే వారి సమాచారం ఆధార్‌కార్డులతో సరిపోల్చుకోవడానికి ఉపయోగపడే ఈకేవైసీ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.
నిరీక్షించి.. నిరాశగా వెనుదిరిగి..
ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వాటిల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. ప్లాట్లు, ఇండ్లు తదితర క్రయవిక్రయాల కోసం ఈ కార్యాలయాలకు నిత్యం ఎంతో మంది వచ్చి వెళ్తారు. గురువారం ఉదయం నుంచి ఆధార్ సర్వర్‌లో సాంకేతిక సమస్యతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ వస్తుందనే నమ్మకంతో పడిగాపులు కాసిన జనం సాయంత్రమైనా సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్లారు.
నిజామాబాద్‌లో సున్నా..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. దీంతో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. ఒక్కో రోజు వందల సంఖ్యలో రిజిస్టేషన్లు అయ్యే కార్యాలయం సర్వర్‌డౌన్ సమస్యతోబోసిపోయి కనిపించింది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతోపాటు ప్రజల సమయం వృథా అయ్యింది.
ఇబ్బందిపడ్డ జనం..
ఎల్లారెడ్డి, జూలై 11: ఎల్లారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ గురువారం ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. సాధారణ రోజుల్లో ఇక్కడ ఎనిమిది నుంచి పది రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఉదయం నుంచి సర్వర్ డౌన్ ఉండడంతో గంటల తరబడి వేచి చూసిన క్రయవిక్రయదారులు.. నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వానికి అధిక ఆదాయాన్నిచ్చే రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు ఏర్పడడంపై ప్రజలు అసహనం వ్యక్తంచేశారు.
బాన్సువాడలో ఒకటే రిజిస్ట్రేషన్..
బాన్సువాడ, జూలై 11 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరక సాంకేతిక సమస్యతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. క్రయవిక్రయాల కోసం వచ్చిన రియల్టర్లు సైతం సర్వర్ డౌన్‌తో కార్యాలయం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొన్నది. బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగినట్లు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
నిలిచిన ‘ధరణి’ సేవలు
బోధన్, జూలై 11: బోధన్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే సమస్య కొనసాగింది. దీంతో ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరగలేదు. సాధారణ రోజుల్లో ఇక్కడ 30 రిజిస్ట్రేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే కాకుండా భూముల వ్యవహారాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే సమస్య ఎదురైంది. బోధన్ తహసీల్తోపాటు చుట్టుపక్కల మండల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా సర్వర్ డౌన్ ఫలితంగా ‘ధరణి’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఆస్తులు, భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ సీడింగ్ చేస్తున్నందున ఈ ఇబ్బంది ఏర్పడిందని కొందరు అంటుండగా, రిజిస్ట్రేషన్ అధికారుల డిజిటల్ సిగ్నేచర్‌ను వారి ఆధార్ నంబర్లతో లింక్ చేస్తున్నందున ఈ సమస్య వచ్చిందని మరికొందరు భావిస్తున్నారు.
సాంకేతిక లోపంతోనే రిజిస్ట్రేషన్లు కాలేదు..
రాష్ట్ర వ్యాప్తంగా సాంకేతిక లోపంతోనే రిజిస్ట్రేషన్లు జరగలేదు. సమస్య పరిష్కారం కాగానే యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అర్జీదారులు ఆందోళన చెందొద్దు. ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి. యూడీఏఐలో సాకేంతికలోపంతో సమస్య ఉత్పన్నమైనట్లు మెస్సేజ్ వచ్చింది. త్వరలోనే సమస్య పరిష్కరించుకొని రిజిస్ట్రేషన్లు జరుపుతాం.
– రామచంద్రయ్య, జిల్లా రిజిస్ట్రార్, నిజామాబాద్
రోజంతా కలిపి మూడే రిజిస్ట్రేషన్లు..
ఆర్మూర్ టౌన్, జూలై 11: ఆర్మూర్ పట్టణంలోని జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వర్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని సబ్ రిజిస్ట్రార్ అధికారి ఆసిఫ్ తెలిపారు. సాంకేతిక సమస్యతో గురువారం మూడు రిజిస్ట్రేషన్లు మాత్రమే చేశామన్నారు. సర్వర్ డౌన్‌తో రిజిస్ట్రేషన్లకు వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారు. కాగా బుధవారం 35 రిజిస్ట్రేషన్లు చేసినట్లు పేర్కొన్నారు.
భీమ్‌గల్‌లో రెండు రోజులుగా తిప్పలు..
భీమ్‌గల్, జూలై 11: రెండు రోజులుగా సర్వర్ డౌన్ సమస్యతో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు. భీమ్‌గల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో భీమ్‌గల్, కమ్మర్పల్లి, వేల్పూర్, మోర్తాడ్, సిరికొండ, ఏర్గట్ల మండలాలు ఉన్నాయి. ఈ ఆరు మండలాలకు చెందిన ఇండ్లు, ప్లాట్లు, భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు భీమ్‌గల్‌కు వస్తుంటారు. రెండు రోజుల నుంచి సర్వర్ రాకపోవడంతో ఆయా మండలాల ప్రజలు నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి. ఇక్కడ రోజుకు సుమారు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రెండు రోజుల నుంచి సుమారు 50వరకు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ప్రభుత్వానికి చలాన్లు కట్టి రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

