జీజీహెచ్ నుంచి బాలుడి కిడ్నాప్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్‌నకు గురైన మూడేండ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు
- బాలుడు క్షేమం.. పోలీసుల అదుపులో నిందితులు
వినాయక్‌నగర్, జూలై 20: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్‌నకు గురైన మూడేండ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మాక్లూర్ మం డలం మానిక్‌బండార్ గ్రామానికి చెందిన సాయినాథ్ భార్య గర్భిణి కాగా, ప్రసవం కోసం ఆమెను ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆమె డెలివరీ వార్డులో ఉండగా, సాయినాథ్ తన మూడేండ్ల కుమారుడు అరుణ్‌తో కలిసి శుక్రవారం రాత్రి దవాఖాన కారిడార్‌లో పడుకున్నాడు.
శనివారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో వచ్చిన ఇద్దరు దుండగులు.. తండ్రి పక్కలో నిద్రిస్తున్న అరుణ్‌ని ఎత్తుకెళ్లారు. ఉదయం సాయినాథ్ లేచి చూడగా కొడుకు కనిపించకపోవడంతో దవాఖానలోని పోలీసు అవుట్ పోస్టు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. వారు ఎంత వెతికినా ఆచూకీ లేకపోవడంతో వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబుకు సమాచారమిచ్చారు. ఆయన వచ్చి దవాఖానలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, అగంతకులు బాబును భుజాన వేసుకొని వెళ్తున్నట్లు గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
సీసీ ఫుటేజీను పరిశీలించిన పోలీసులు బాలుడిని కిడ్నాపర్లు మెట్పల్లి వైపు తీసుకువెళ్తున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. కిడ్నాపర్లను పట్టుకొని వారి నుంచి బాబును స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కాగా కిడ్నాపర్లలో ఒకరి సోదరికి సంతానం లేకపోవడంతోనే బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం. కిడ్నాపర్లు జిల్లాకు చెందిన వారిగా తెలిసింది. పోలీసులు బాలుడిని మెట్పల్లి నుంచి నిజామాబాద్‌కు తీసుకువచ్చినట్లు, నిందితులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించడంతో ఎస్‌హెచ్‌వో విజయ్బాబుతోపాటు ప్రత్యేక బృందాన్ని సీపీ అభినందించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

