తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల

నిజామాబాద్ : తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. శనివారం నిజామాబాద్ అర్బన్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థని స్థాపించి తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడంతో మహిళలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. బతుకమ్మ చీరల తయారీతో చేనేతలకు ఉపాధి కల్పించడంతోపాటు తెలంగాణ ఆడబిడ్డలకు చీరలను అందేలా చూసారని అన్నారు.
నగర ప్రజలు బతుకమ్మ, దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం నగరంలోని 13వ డివిజన్లో ఉన్న డైయిరీ ఫామ్ రోడ్లో బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరమేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

