ఆర్మూర్/ఆర్మూర్ టౌన్, నవంబర్1: ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 3న ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డులో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రజా ప్రతినిధలు , నాయకులు, కార్యకర్తలతో ప్రజా ఆశీర్వాద సభకు జన సమీకరణ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. సభకు గ్రామాల నుంచి ప్రజలను అధిక సంఖ్యలో తరలించాలని సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించారు.