పనులు వేగవంతం చేయాలి
మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఆర్మూర్ అరణ్య పార్కు పనులను కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు.
- కలెక్టర్ నారాయణరెడ్డి
ఆర్మూర్/ మాక్లూర్, డిసెంబర్29: మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఆర్మూర్ అరణ్య పార్కు పనులను కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. నెల రోజుల్లోపు అరణ్య పార్కు ప్రారంభోత్సవం కానున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఈజీఎస్ కూలీలతో పనులు చేయించాలని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శంకర్, ఎంపీవో శ్రీనివాస్, అటవీశాఖ అధికారులు భవానీ శంకర్ తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి సందర్శించారు. అంకాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటుకు గ్రామంలో స్థలాన్ని పరిశీలించారు. అంకాపూర్ మార్కెట్ సమీపంలో నిజాంసాగర్ కాలువ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ వేణుగోపాల్‌గౌడ్, గ్రామ ఉప సర్పంచ్ కిశోర్‌రెడ్డి, సర్వేయర్ రాజు, ఏపీవో సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

