Armoor | తండా సమస్యలపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వినతులు
సమస్యలు పరిష్కరించి, వసతులు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డికి మాక్లూర్ మండల పరిధిలోని మానిక్‌బండార్ 2వ డివిజన్‌కు చెందిన మానిక్‌బండార్ తండావాసులు విజ్ఞప్తి చేశారు.

మాక్లూర్: సమస్యలు పరిష్కరించి, వసతులు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డికి మాక్లూర్ మండల పరిధిలోని 2వ డివిజన్‌కు చెందిన మానిక్‌బండార్ తండావాసులువిన్నవించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో రేషన్ దుకాణం లేదని చెప్పారు. దీంతో దూరప్రాంతాకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని తెలిపారు. అంతేగాకుండా విద్యుత్ సమస్య ఉందని, రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. తండాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే వారికి హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు, తండా పెద్దలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

