Santana Nagamma Temple | ఏకచక్రనగర్లో ఘనంగా సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవం
బోధన్ పట్టణం ఏకచక్ర నగర్ లోని సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ జరిపించారు.
Santana Nagamma Temple | శక్కర్ నగర్ : బోధన్ పట్టణం ఏకచక్ర నగర్ లోని సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన్నప్రసాద వితరణ జరిపించారు. ఆలయ వ్యవస్థాపకుడు గుమ్ముల అశోక్ రెడ్డి, నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయం చాలా విశిష్టమైందని, ఆలయంలో మొక్కిన ప్రతీ ఒక్కరికీ సంతానం కలిగిందని, అమ్మవారిని భక్తులు కోరినకోర్కెలు తీర్చే అమ్మవారిగా కొలుస్తారని అన్నారు.
కేవలం బోధన్ నుంచే కాకుండా ఆలయానికి పక్కనే ఉన్న మహారాష్ట్ర కు చెందిన భక్తులు కూడా రావడం విశేషం. ఆదివారం నిర్వహించిన 16వ వార్షికోత్సవ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడు గుమ్ముల అశోక్ రెడ్డి, నిర్వాహకులు టీవీ రవి, సాయిలు, నారాయణ, గుమ్ముల గంగాధర్, ఎం గంగాధర్, సీతారాం ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు సేవలు అందించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

