knife Attack | రూ.10 వేల కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు
రూ.10 వేల అప్పు ఇచ్చి తిరిగి అడిగి ఘటనలో ఘర్షణ పెరిగి కత్తితో దాడి వైపునకు దారి తీసింది. ఈఘటనలో ఒకిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
knife Attack | మక్లూరు : రూ.10 వేల అప్పు ఇచ్చి తిరిగి అడిగి ఘటనలో ఘర్షణ పెరిగి కత్తితో దాడి వైపునకు దారి తీసింది. ఈఘటనలో ఒకిరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని మాణిక్ బండార్ గ్రామానికి చెందిన నీరడి వినయ్ నిజామాబాద్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కటికే శంకర్ కు వినయ్ బాకీ ఉన్నాడు.
బాకీ విషయం తీర్చమని శంకర్ వినయ్ ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో వినయ్, అతని కుమారుడు శంకర్‌పై కర్రతో దాడి చేశారు. ఈఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలు తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కాగా అక్కడ ఇద్దరూ ఎదురుపడ్డారు. దీంతో శంకర్ తనపై దాడి చేశాడనే ఆగ్రహంతో వినయ్ కత్తితో దాడికి దిగగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరువురిని అదుపులోకి తీసుకుని గాయాలైన వినయ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

