Peddakodapgal | ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ మంగళవారం పరిశీలించారు.
Peddakodapgal | పెద్దకొడప్గల్, జూలై 14 : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని చిన్నతక్కడపల్లి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను అదనపు కలెక్టర్ విక్టర్ మంగళవారం పరిశీలించారు. ఇంటింటి సర్వే, దరఖాస్తుల స్వీకరణ, ఫారాల నమోదు, అర్హుల వివరాల సేకరణ తదితర అంశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ సర్వేలో ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ, ప్రతీ అర్హుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజశేఖర్, సర్పంచ్ వినోద్, మండల అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు (BLOలు), సర్వే సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

