పాత నేరస్తుడి అరెస్టు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన కరడుగట్టిన నేరస్తుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతనిపై 18 చోరీ కేసులతోపాటు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు సైతం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
- ఉమ్మడి జిల్లాలో వరుస దొంగతనాలు
- 19 కేసుల్లో నిందితుడు
- చోరీ సొత్తు స్వాధీనం.. కారు సీజ్
- విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్ వెల్లడి
నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 29: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన కరడుగట్టిన నేరస్తుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతనిపై 18 చోరీ కేసులతోపాటు ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు సైతం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో త్రీటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని గౌతంనగర్ ప్రాంతంలో ఈ నెల17న తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేపట్టగా సదరు పాత నేరస్తుడి నేరచరిత్ర వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గౌతంనగర్‌కు చెందిన బేగారి రాజు ఈ నెల 17న తన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి 19వ తేదీన రాగా ఇంటి తాళం ధ్వంసం చేసి ఉండడంతోపాటు ఇంట్లోని బంగారం,వెండి చోరీకి గురైనట్లు గుర్తించి స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్చార్జి సీఐ పుప్పాల శ్రీశైలం ఆధ్వర్యంలో అటాచ్డ్ ఎస్సై, సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌తోపాటు లభ్యమైన ఇతర ఆధారాలతో నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన కందికంటి రాజు గౌడ్ అలియాస్ చిల్లిరాజును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారించారు. సదరు నిందితుడిపై బోధన్ పట్టణ పరిధిలో మర్డర్ ఫర్ గెయిన్, అటెంప్ట్ మర్డర్ కేసులతోపాటు వేర్వేరు పోలీసు స్టేషన్లలో 18 చోరీ కేసులు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ సైతం ఉన్నట్లు చెప్పారు.నిందితుడు తాను చేసిన నేరాలను అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రెండు ఇత్తడి దీపాలు,15 రాగి చెంబులు, రెండు చిన్న ఇత్తడి మాణిక్యాలు, మూడు రాగిప్లేట్లు, ఒక రాగి బిందె, రెండు స్టీల్ జగ్గులు, ఒక ఇత్తడి తాంబూలం, నాలుగు స్టీల్ బాగోనెలు, మూడు వెండి బిస్కెట్లు, కామారెడ్డి జిల్లాకు సంబంధించి చోరీ కేసు సొత్తుతోపాటు నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనం కేసులో 14 గ్రాముల బంగారం గొలుసు,12.9 గ్రాముల బంగారు నెక్లెస్ ,రెండు బంగారు కమ్మలు 10.21 గ్రాములు, నాలుగు బంగారు ఉంగరాలు 7.9 గ్రాములు రికవరీ చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. నేరాలకు ఉపయోగించిన కారును సైతం సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ శ్రీశైలంతోపాటు అటాచ్డ్ ఎస్సై, సిబ్బంది అఫ్సర్, వెంకట్ రామ్, హోంగార్డు జగన్‌ను అభినందించారు. వారికి రివార్డు సైతం అందజేయనున్నట్లు ఏసీపీ చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

