వరి సాగుకు ఉపయోగకరమైన నేల?
- కింది వాటిని జతపర్చండి
- మృత్తిక
ఎ) మృత్తికల క్రమక్షయం - పెడాలజీ
బి) నేలల పుట్టుక అధ్యయనం - పెడోజెనెనిస్
సి) సారవంతమైన మట్టి - ఏప్రిల్ 22
డి) ప్రపంచ ధాత్రి దినోత్సవం
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
- మృత్తిక
- 1898లో వెదర్ అనే శాస్త్రవేత్త మృత్తికలను ఏ విధంగా వర్గీకరించారు?
1) ఒండ్రు మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు, ఎర్రరేగడి మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు 4) పైవన్నీ - 1929లో ఐసీఏఆర్ మృత్తికలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అవి ఏవి?
1) ఒండ్రు మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు, జేగురు మృత్తికలు
3) ఎడారి, పర్వతీయ, క్షార, పీఠభూమి మృత్తికలు
4) పైవన్నీ - ఒండ్రు మృత్తికల గురించి సరైనది?
1) భారత్‌లో నదీ పరీవాహక ప్రాంతంలో ఉండే మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు ముఖ్యంగా ఖాదర్ అంటారు
3) శివాలిక్ ప్రాంతాల వద్ద ఉన్న చిత్తడి
నేలలను టెరాయి అంటారు
4) పైవన్నీ - ఒండ్రు నేలల గురించి సరికానిది?
1) ఇవి అత్యంత సారవంతమైన మృత్తికలు
2) వీటిలో పొటాషియం, కాల్షియం అనే
ఖనిజాలు ఉంటాయి
3) దీనిలో ఎక్కువగా పప్పుధాన్యాలు మాత్రమే పండుతాయి
4) ఈ మృత్తికలు లేత గోధుమరంగు లేదా ముదురు రంగులో ఉంటాయి - నల్లరేగడి మృత్తికలు ఎక్కువగా ఏ రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి?
1) మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్
2) గుజరాత్, పంజాబ్, హర్యానా
3) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా
4) సిక్కిం, మేఘాలయ, కేరళ - నల్లరేగడి మృత్తికలకు సంబంధించి సరైనది?
1) నల్లరేగడి మృత్తికలకు రేగర్, బ్లాక్ కాటన్ మృత్తికలు, చెర్నోజెమ్ నేలలు అని
పిలుస్తారు
2) వీటిని కాలిఫోర్నియాలో హరిజోనా నేలలు అంటారు
3) వీటిలోఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం ఖనిజాలు ఉంటాయి
4) పైవన్నీ సరైనవే - నల్లరేగడి నేలలకు సంబంధించి సరికానిది?
1) ఈ నేలల్లో విస్తరించిన శిలలు బసాల్ట్, గ్రానైట్
2) ఈ నేలలు పత్తి, పొగాకు పంటలకు
అనుకూలం
3) ఈ నేలలు ఎరుపు రంగులో ఉంటాయి
4) ఇవి బూడిద, నలుపు రంగులో ఉంటాయి - తనను తాను దున్నుకొనే నేలలు, నీటిని నిల్వ ఉంచుకొనే నేలలు అని ఏ మృత్తికలను పిలుస్తారు?
1) ఎర్రరేగడి మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు - ఎర్రరేగడి మృత్తికల గురించి సరైనది?
1) ఇవి తమిళనాడు, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి
2) ఇవి దేశం వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి
3) వీటిలో ఐరన్, పొటాషియం,
మెగ్నీషియం ఖనిజాలు ఉన్నాయి
4) పైవన్నీ సరైనవే - ఎర్రరేగడి నేలలు అధికంగా ఉండే రాష్ర్టాలు?
1) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
2) రాజస్థాన్, గుజరాత్
3) హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్
4) పంజాబ్, హర్యానా - ఎర్ర మృత్తికల ప్రత్యేకత?
1) తమను తాము దున్నుకొనే నేలలు
2) గాలి పారాడేటట్లు ఉంటాయి
3) క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరికానిది?
1) నల్లరేగడి నేలలు పరిశోధన కేంద్రం
– బళ్లారి
2) యమున, అవనాళిక పరిశోధన ప్రాంతం -ఆగ్రా
3) కేంద్రీయ అటవీ నేలల పరిశోధన కేంద్రం – డెహ్రాడూన్
4) ఏదీకాదు - నేలలను 8 రకాలుగా వర్గీకరించినది?
1) ఓల్కర్, వెదర్
2) సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా
3) ఐసీఏఆర్ 4) పైవన్నీ - తీవ్రత పరంగా క్రమక్షయాలను ఆరోహణ క్రమంలో అమర్చండి?
1) పట, అవనాళిక, వంక
2) వంక, పట, అవనాళిక
3) అవనాళిక, వంక, పట
4) పట, వంక, అవనాళిక - విస్తీర్ణపరంగా నేలల అవరోహణ క్రమం?
1) నల్ల, ఒండ్రు, ఎర్ర, జేగురు
2) జేగురు, ఒండ్రు, నల్ల, ఎర్ర
3) ఎర్ర, నల్ల, ఒండ్రు, జేగురు
4) ఎర్ర, ఒండ్రు, జేగురు, నల్ల - పంజాబ్ నుంచి అసోం వరకు విస్తరించి ఉన్న ఇండో గంగా మైదానంలో ఏ రకమైన నేలలు ఉన్నాయి?
1) నల్లరేగడి నేలలు 2) ఎర్రరేగడి నేలలు
3) లాటరైట్ నేలలు 4) అల్యూవియల్ నేలలు - ఖాదర్ నేలలు ఎక్కడ ఉంటాయి?
1) ఎక్కువ ఎత్తయిన వాలులు
2) తక్కువ చదరంగా ఉండే ప్రాంతాలు
3) ఇన్ షీడ్మంట్ మైదానాలు
4) వరద మైదానాలు - అగ్ని పర్వతాల నుంచి వెలువడిన లావా నిక్షేపాల ఫలితంగా ఏర్పడిన మృత్తిక?
1) ఎర్రకంకర మృత్తిక
2) నల్ల మృత్తిక
3) ఎర్ర మృత్తిక
4) ఒండ్రుమట్టి మృత్తిక - జల పట్టిక దేనిని సూచిస్తుంది?
1) అల్ప గాఢత ఉన్న మండలం
2) అధికంగా ఉన్న మండలం
3) భూగర్భంలో కాలువల రూపంలో
ప్రవహించే నీరు
4) పార గమ్యం గల, పార గమ్యం లేని రాళ్లు స్పర్శించు - ఏ నేలలు ఉన్న ప్రాంతాల్లో గొప్ప నాగరికతలు విలసిల్లాయి?
1) ఎర్రరేగడి నేలలు 2) మౌంటెన్ నేలలు
3) నల్లరేగడి నేలలు
4) అల్యూవియల్ నేలలు - విభిన్న నేలల రకాల అధ్యయనం?
1) ఫిజియాలజీ 2) ఫైలోజిన్నీ
3) పోయోలజీ 4) పెడాలజీ - ‘రెగురు’ అనే పదం కింది వాటిలో ఒక దానికి నిర్దేశించింది?
1) డెల్టా ఒండ్రుమృత్తికలు
2) లాటరైట్ మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) ఎర్ర లేత వర్ణం - మృత్తిక నేలనందలి పొరలను ఏమంటారు?
1) హార్డ్ప్యాన్స్ 2) ప్రొఫైల్
3) పెడకల్స్ 4) హొరైజన్స్ - పీటీ రేగడి భూమి ఉన్న ప్రదేశం?
1) కశ్మీర్‌లోయ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరాంచల్/ ఉత్తరాఖండ్
4) రాజస్థాన్ - వరి సాగుకు ఉపయోగకరమైన నేల?
1) డెల్టాలోని బురద భూములు
2) ఒండ్రు భూములు
3) బురద భూములు
4) ఇసుక భూములు - నల్లరేగడి భూమి చాలా తక్కువగా దున్నవలసి వస్తుంది ఎందుకు?
1) ఇది సారవంతమైనది
2) ఇది ఎండిపోతే పగుళ్లు ఏర్పడతాయి
3) ఇది లావాకు పోతాయి
4) ఇది ఇనుము, అల్యూమినియం మిశ్రమాలను చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది - అస్సాంలోని ఎర్రరేగడి నేలల గుండా ప్రవహించడం వల్ల ఏ నదిని రెడ్రివర్ అని పిలుస్తారు?
1) బ్రహ్మపుత్రానది 2) గోదావరినది
3) కృష్ణానది 4) కావేరి నది - జేగురు మృత్తికల గురించి సరైనది?
1) లాటిన్ భాష లక్ష లాటర్ అంటే ‘ఇటుక’ అని అర్థం
2) 1810లో మలబార్ తీరంలో బుకానన్ అనే వ్యక్తి ఈ నేలలను కనుగొన్నారు
3) వీటిలో బాక్సైట్, టైటానియం,
మోనజైట్, అల్యూమినియం ఖనిజాలు ఉంటాయి
4) పైవన్నీ సరైనవే - జేగురు మృత్తికలు విస్తరించిన ప్రాంతాలకు సంబంధించి సరైనది?
1) పశ్చిమ కనుమల్లోని కేరళ, కర్ణాటక
2) తూర్పు కనుమల్లోని తమిళనాడు, ఒరిస్సా
3) తెలంగాణలోని మెదక్‌లో గల నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలు
4) పైవన్నీ సరైనవే - జేగురు మృత్తికలకు సంబంధించి సరైనది?
1) ఈ నేలలో అధికంగా ఉండే ఖనిజం బాక్సైట్
2) ఈ నేలలు తోట పంటలకు (కాఫీ, తేయాకు, రబ్బరు) సారవంతమైనవి
3) ఈ నేలలను యుగోస్లేవియాలోని
టెగ్రారోసా నేలలతో పోలుస్తారు
4) పైవన్నీ సరైనవే - ఎడారి నేలలు శుష్క నేలలకు సంబంధించి సరైనది?
1) ఈ నేలలు సింధు నదికి, ఆరావళి పర్వతాలకు మధ్యగల గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
2) ఈ నేలలో అధికంగా ఉండే ఖనిజం పాస్ఫరస్
3) ఈ నేలలు ఎరుపు, గోదుమ రంగులో ఉంటాయి 4) పైవన్నీ సరైనవే - పర్వతీయ అటవీ మృత్తికలకు సంబంధించి సరైనది?
1) ఇవి పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, హిమాలయ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి
2) ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందని నేలలు
3) ఇందులో ఎక్కువగా ఉండే పదార్థం హ్యూమస్
4) పైవన్నీ సరైనవే - క్షార నేలలకు సంబంధించి సరికానిది?
1) ఈ నేలలు దక్షిణ పంజాబ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి
2) వీటిని పంజాబ్‌లో రే, కల్లార్, రకర్, తుర్ అని పిలుస్తారు
3) వీటిని గుజరాత్లో కర్గ్, చోపాన్ అని పిలుస్తారు
4) వీటిలో ఎక్కువగా సోడియం,
పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం
ఖనిజాలు ఉంటాయి - అధిక వర్షపాతం సంభవించినప్పుడు నేల పై పొరలోని ఖనిజ లవణాలు భూమి లోపలి పొరలోకి ఇంకిపోవడాన్ని ఏమంటారు?
1) చోపాన్ 2) రీబింగ్
3) కర్గ్ 4) కజక్
వెంకట్
విషయ నిపుణులు
సిద్దిపేట
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

