బీఈఎల్‌లో ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్లు
బీఈఎల్| ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసు

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనుంది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వచ్చేనెల 19వతేదీలో పంపించాలని కోరింది.
మొత్తం పోస్టులు: 23
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 20, ప్రాజెక్ట్ ఆఫీసర్ 1, ట్రైనీ ఆఫీసర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్) కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఏదో ఒకటి చేసి ఉండాలి. ట్రైనీ ఆఫీసర్‌కు ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీడీఎంలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Sr. Dy. Gen. Manager (CS, FTD, HR&A) Bharat Electronics Limited, Plot No. L-1, MIDC Industrial Area, Taloja, Navi Mumbai: 410208, Maharashtra.
దరఖాస్తులకు చివరితేదీ: మే 19
వెబ్సైట్: https://www.bel-india.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

