IIIT Bhagalpur | చిన్న పట్టణం నుంచి ఎదిగి రూ. 83 లక్షల వేతన ప్యాకేజ్‌ను అందుకుంది
IIIT Bhagalpur : ఐఐటీ, ఐఐఎంలో చదవకపోయినా ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన బీటెక్ విద్యార్ధిని సత్తా చాటింది. బిహార్‌లోని భాగల్పూర్ ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని ఇషికా ఝా రూ. 83 లక్షల ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్‌ను దక్కించుకుంది.
IIIT Bhagalpur : ఐఐటీ, ఐఐఎంలో చదవకపోయినా ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన బీటెక్ విద్యార్ధిని సత్తా చాటింది. బిహార్‌లోని భాగల్పూర్ ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని ఇషికా ఝా రూ. 83 లక్షల ప్యాకేజ్‌తో జాబ్ ఆఫర్‌ను దక్కించుకుంది. హరియాణలోని ఓ చిన్న పట్టణం ఇషికా స్వస్ధలం.
ఆమె తన టెక్నికల్ స్కిల్స్‌కు పదునుపెట్టుకునేందుకు కోడింగ్ ఛాలెంజెస్లో పాల్గొనడంతో పాటు వెబ్ డెవలప్మెంట్పై ఫోకస్ పెడుతోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇషికా ఈ భారీ ఆఫర్‌ను చేజిక్కించుకుంది. చిన్ననాటి నుంచే కంప్యూటర్లు, కోడింగ్‌పై ఇష్టం పెంచుకున్న ఇషికా బాల్యంలోనే కోడింగ్‌పై పట్టు పెంచుకుంది.
ఆమె అంకితభావం, ప్రాక్టీస్ ఫలించి క్రేజీ ఆఫర్ తను సొంతం చేసుకుంది. గూగుల్ హ్యాకథాన్ తుది రౌండ్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఫారెస్ట్ ఫైర్ ప్రిడిక్షన్‌పై ప్రాజెక్ట్‌ను తయారుచేసి జడ్జిల మన్ననలు పొందింది. నేపధ్యం, ఏ విద్యా సంస్ధలో చదివారనే వాటితో సంబంధం లేకుండా సామర్ధ్యం, అంకితభావం, పట్టుదలతో శ్రమిస్తే ప్రతిష్టాత్మక సంస్ధల్లో భారీ ప్యాకేజ్లతో కండ్లు చెదిరే ఆఫర్లు దక్కుతాయని ఇషికా ఝా మరోసారి నిరూపించింది.
Read More :
Delhi Man Stomped By Bull | కుమారుడి కోసం స్కూల్‌కు వెళ్లిన వ్యక్తి.. ఆవు దాడిలో మృతి
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

