ఎన్సీఈఆర్టీలో టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టులు
ఎన్సీఈఆర్టీ| నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది.

న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సీఐఈటీ) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. నూతన జాతీయ విద్యావిధానంలో (ఎన్ఈపీ) నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్స్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా వివిధ ప్రాజెక్టుల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు న్యూఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 25
ఇందులో సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ 2, టెక్నికల్ కన్సల్టెంట్ 10, డాటా సైన్స్ స్పెషలిస్ట్ 2, డాటా అనలిస్ట్ 2, మొబైల్ యాప్స్ స్పెషలిస్ట్ 2, సోషల్ మీడియా మేనేజర్ 2, గ్రాఫిక్ డిజైన్ 3, అకౌంటెంట్ 1, ఆఫీస్ అసిస్టెంట్1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ కానీ పీజీ కానీ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్. దరఖాస్తుల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో (గూగుల్ ఫామ్). నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 23
వెబ్సైట్: https://forms.gle/JJrRnmGz7Z5ytDYn6 l
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

