హైదరాబాద్ : తెలంగాణ విద్యా శాఖ నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) ఎగ్జామ్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ సాట్ శుభవార్త వినిపించింది. ఈ నెల 6వ తేదీ నుంచి టీ సాట్ యూట్యూబ్ చానెల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
6న ఉదయం 8 గంటల నుంచి 8:30 గంటల వరకు గణితం(పేపర్-1) రేఖాగణితం బోధించనున్నారు. ఉదయం 8:30 నుంచి ఉదయం 9 వరకు గణితం(పేపర్-2) రేఖాగణితం బోధించనున్నారు. ఇక 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్(పేపర్-1) బోధనా శాస్త్రం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ ఇంగ్లీష్(పేపర్-2) బోధనా శాస్త్రం బోధించనున్నారు.
ఈ టైం టేబుల్ కేవలం 6వ తేదీకి మాత్రమే వర్తించనుంది. 7వ తేదీ టైం టేబుల్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఈ ఆన్లైన్ బోధన జూన్ 5వ తేదీ వరకు కొనసాగనుంది. ఆన్లైన్ బోధన కోసం T SAT VIDYA చానెల్‌ను సంప్రదించగలరు.