కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సెస్సీ
SSC | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్ (జీడీ)
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వంటి విభాగాల్లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 24,205 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సహస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం పోస్టులు: 24,205
ఇవి బీఎస్ఎఫ్ 10,497, సీఐఎస్ఎఫ్ 100, సీఆర్పీఎఫ్ 8911, ఎస్ఎస్బీ 1284, ఐటీబీపీ 1613, ఏఆర్ 1697, ఎస్ఎస్ఎఫ్ 103 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఇంటర్ లేదా 10+2 ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు 26 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30
రాతపరీక్ష: 2023, జనవరిలో
వెబ్సైట్: https://www.ssc.nic.in లేదా http://www.crpf.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

