సంఘ సంస్కర్తలు.. సమసమాజ నిర్మాతలు
భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి. రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి మంచినీళ్లు ఉపయోగించే హక్కుల కోసం పోరాటం చేశాడు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్
- భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి.
- రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్.
- బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడాడు.
- 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం ప్రభుత్వ తాగునీటి వనరుల నుంచి మంచినీళ్లు ఉపయోగించే హక్కుల కోసం పోరాటం చేశాడు.
- దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించడానికి ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’ని స్థాపించాడు.
- మహిళలకు విస్తృత సామాజిక, ఆర్థిక హక్కుల కోసం పోరాడాడు.
- షెడ్యూల్డ్ కులాలు, తెగలకు పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సభను ఒప్పించాడు.
- అంబేద్కర్ తన జీవిత చరమ దశలో బౌద్ధమతాన్ని స్వీకరించాడు.
కందూకూరి వీరేశలింగం
- ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సంఘ సంస్కర్త.
- వితంతువుల పునర్వివాహానికి, బాల్య వివాహాల నిషేధానికి కృషి చేశాడు.
- మహిళల చదువుల కోసం పోరాడాడు.
- గద్య తిక్కనగా ప్రసిద్ధి.
స్వామి వివేకానంద
- రామకృష్ణ పరమహంస శిష్యుడు
- రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు.
- హిందూ మతం ఇతర మతాల కంటే గొప్పదని భావించాడు.
- ఉపనిషత్తుల బోధనలకు ప్రాధాన్యం ఇచ్చాడు.
రాజారామ్మోన్రాయ్

Rajaram Mohan Rao
- 1828లో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు.
- సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిష్ భాషల్లో పండితుడు.
- ‘దేవుడు ఒక్కడే’ అని నమ్మాడు.
- విగ్రహారాధన, జంతు బలులు ఇవ్వడం సరికాదన్నాడు.
- విశ్వజనీన మతంలో నమ్మకం కలవాడు.
- ‘సతీ సహగమనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.
- తమ మతాల్లోని మూల గ్రంథాలను చదవమని ప్రజలను కోరాడు.
స్వామి దయానంద సరస్వతి
- 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు.
- నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మాడు.
- విగ్రహారాధన, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను తిరస్కరించాడు.
- ఇతర మతాలకు మారిన హిందువులు వేదాల ఆధారంగా ఉన్న హిందూ మతంలోకి రావాలని భావించాడు.
- సత్యార్థ ప్రకాశ్ అనే పుస్తకాన్ని రాశాడు.
అల్లూరి సీతారామరాజు
- 1882లో బ్రిటిష్ వారు అటవీ చట్టం చేసి గిరిజనులు అడవుల్లో స్వేచ్ఛగా తిరగకుండా, పోడు వ్యవసాయం చేయకుండా అడ్డుకున్నారు
- బ్రిటిషు వాళ్ల వేధింపులకు వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళనలకు సీతారామరాజు నాయకత్వం వహించాడు.
- 1922 రంపా తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన తిరుగుబాటులో పోలీసు స్టేషన్లపై దాడి చేశారు.
- గిరిజనులు తమ సంప్రదాయ ఆయుధాలతో, స్వాధీనం చేసుకున్న ఆయుధాలతో పోరాటం చేశారు.
- ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి బ్రిటిష్ పాలకులు రూథర్‌ఫర్డ్ నాయకత్వంలో అస్సాం రైఫిల్స్‌ను పంపించింది.
- గంటం దొర వంటి గిరిజన నాయకులందరినీ చంపేశారు.
- చివరికి సీతారామరాజును కూడా కాల్చి చంపేశారు.
జ్యోతిబాఫులే

Jyotiba Phule
- సత్యం, సమానత్వం అనే సూత్రాల ఆధారంగా సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు.
- కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గులామ్‌గిరీ అనే పుస్తకాన్ని రచించాడు.
- బ్రాహ్మణులు లేకుండా వివాహాలు, కర్మకాండలు నిర్వహించాలని నిమ్న కులాలకు పిలుపునిచ్చాడు.
- మహర్, మాంగ్ వంటి అంటరాని కులాలకు చెందిన బాలికల కోసం భార్య సావిత్రిబాయి ఫులేతో కలిసి పాఠశాలను ప్రారంభించారు.
నారాయణగురు
- బాలల సంరక్షణ కోసం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు.
- మనుషులందరికీ ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనే భావనను ప్రచారం చేశాడు.
- కుల వివక్ష పాటించని దేవాలయాలను స్థాపించాడు.
- గుడులు కట్టడం కంటే బాలలకు బడులు కట్టడం ఎంతో ముఖ్యమని చెప్పాడు.
గాంధీజీ

Gandhi
- అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.
- అంటరాని కులాల వారికి హరిజనులు అంటే దేవుడి ప్రజలు అని పేరు పెట్టాడు.
- ‘భారత జాతిపిత’గా కీర్తించబడ్డాడు.
- భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
- దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశ హక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు.
కొండా లక్ష్మణ్‌బాపూజీ

Konada
- కుల వివక్షతో కూడుకున్న గ్రామీణ అంశాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకుడిగా ఎదిగాడు.
- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాలో వెట్టిని చూసి శ్రమ/సంపద దోపిడీకి కులం/వృత్తి ఎలా ఉపయోగపడుతుందో చూశాడు.
- నిజాం పరిపాలనను అంతమొందించటానికి సాయుధ చర్యలను సైతం బాపూజీ కోరుకున్నాడు.
- నిజాంను భౌతికంగా నిర్మూలించటానికి బాం బులు వేయడంలో ప్రజలకు శిక్షణ ఇచ్చాడు.
- లక్ష్మణ్ బాపూజీ స్వతహాగా లాయరు. విసునూరు రామచంద్రారెడ్డిపై అనేక కేసుల్లో ప్రజల తరఫున వాదించాడు.
- ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్య తరహాలో పనిచేసినంత వరకు కమ్యూనిస్టులతో సన్నిహితంగా కలిసి పనిచేశాడు.
భాగ్యరెడ్డి వర్మ
- ఏపీలో దళితుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడాడు.
- దళితులను ‘ఆది హిందువులు’గా పిలవాలని పిలుపునిచ్చాడు.
- దళితులు ‘బౌద్ధమతాన్ని’ చేపట్టడాన్ని ప్రోత్సహించాడు.
- జనాదరణ పొందిన కళలను ఉపయోగించుకుని దళితుల్లో చైతన్యం కలిగించడానికి ‘జగన్మిత్ర మండలి’ని ప్రారంభించాడు.
సావిత్రిబాయి ఫులే
- జ్యోతిబా ఫులే భార్య
- మహారాష్ట్రలో మహిళా హక్కుల కోసం ప్రయత్నించారు.
- ఈమె మొదటి ‘మహిళా ఉపాధ్యాయిని’.
- ప్లేగు వ్యాధి బారిన పడిన ప్రజల కోసం అహర్నిశలు పనిచేసింది.
పండిత రమాబాయి సరస్వతి
- వితంతువులకు సహాయపడటానికి తన జీవితమంతా అంకితం చేసింది.
- ఆమె స్థాపించిన పాఠశాలలో (శారదా సదన్) మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా అనేక వృత్తి విద్యలు, నైపుణ్యాలు నేర్పించేవారు.
బద్ధం ఎల్లారెడ్డి
- 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకుల్లో బద్ధం ఎల్లారెడ్డి ఒకరు.
- హైదరాబాద్‌లో హరిజనోద్ధరణ కార్యక్రమాలను చేపట్టాడు.
- తర్వాత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా మారి తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేశాడు.
భీంరెడ్డి నరసింహారెడ్డి
- వామపక్ష భావాలకు ప్రభావితుడై కమ్యూనిస్టుగా మారాడు.
- భూస్వాములకు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా, వెట్టి వ్యతిరేక పోరాటాలు నిర్వహించాడు.
- అజ్ఞాత కార్యకర్తగా పనిచేస్తూ తర్వాత ‘దళం’ నాయకుడిగా మారాడు.
బొమ్మగాని ధర్మభిక్షం
- విద్యార్థి దశలోనే రాజీకయ కార్యకలాపాల్లో చురుకుగా పనిచేశాడు.
- పేద పిల్లల కోసం సూర్యాపేటలో హాస్టల్‌ను ప్రారంభించాడు.
- అనంతరం నల్లగొండ జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగాడు.
సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
- ముస్లిం ప్రజలు ఆధునీకరణ చెందడానికి కృషి చేశాడు.
- ముస్లింలకు, బ్రిటిష్ వారికి మధ్య శత్రుత్వం అంతం కావాలని భావించాడు.
- ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద వాటా పొందాలని భావించాడు.
బేగం రోఖియా సఖావత్ హుస్సేన్
- ముస్లిం మహిళల్లో విద్యావ్యాప్తికి కృషి
- అన్ని మతాల నాయకులు మహిళలకు తక్కువ స్థానాన్ని ఇచ్చారని వాదిస్తూ, సనాతన భావాలను నిర్భయంగా విమర్శించారు.
షేక్ నాజర్ వలి
- బుర్రకథకు విస్తృత ప్రజాదరణ లభించేలా చేశాడు
- ఎంతో ప్రజాదరణ పొందిన నాజర్ బుర్రకథ – ‘మాస్కో పొలిమేరలోన’
- ఆంధ్రకరువు, 1943 బెంగాల్ కరువుపై అతడి బుర్రకథలు ప్రజలను ఎంతగానో కదిలించేవే.
- 1986లో పద్మశ్రీతో సహా ఎన్నో బహుమతులు పొందాడు.
కుమ్రం భీం
- కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు చెందిన గోండు జాతి ఆదివాసి.
- నిరక్షరాస్యుడు అయినప్పటికీ నైజాం ప్రభుత్వం సాగిస్తున్న గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాడు.
- అతడి పోరాటాలు న్యాయస్థానంలోనూ, ఆయుధాలతోనూ సాగాయి.
- బాబేఝరి వద్ద నైజాం ప్రభుత్వంతో జరిగిన పోరాటంలో కుమ్రం భీం 1940 అక్టోబర్ 27న మరణించాడు.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

