ఎస్బీఐలో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
SBI | ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 48 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 48
ఇందులో నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అసిస్టెంట్ మేజనర్ 15, రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ 33 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 40 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షను 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకి 25 మార్కులు కేటాయించారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 25
ఆన్లైన్ పరీక్ష: మార్చి 20
వెబ్సైట్: https://www.sbi.co.in/web/careers
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

