TS EDCET | ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
TS EDCET | రెండేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం విడుదల చేశారు.
TS EDCET | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్నది. జనరల్, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్‌సెట్‌ను మే 18న ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో నిర్వహిస్తారు. ఎడ్‌సెట్‌ను గతంలో ఉస్మానియా వర్సిటీ నిర్వహించింది.
ఈ ఏడాది నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ కృష్ణారావు, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ, ప్రొఫెసర్ ఏ రవికుమార్, ప్రొఫెసర్ పారుపల్లి శంకర్తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?


