JEE Main | జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తులు ప్రారంభం..
జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
న్యూఢిల్లీ: జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. మొదటి సెషన్‌కు సంబంధించిన పరీక్షలను జనవరి 24 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు ఎన్టీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 1-15 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు ఎగ్జామ్ క్యాలెండర్లో ఎన్టీఏ (NTA) పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షలకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
జేఈఈ మెయిన్ ద్వారా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీలు, సీఎఫ్‌టీఐలలో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దీనికోసం ఏటా రెండుసార్లు జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటికే మొదటి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు ముగిశాయి. మరో రెండు వారాల్లో పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Applications
- BArch
- BE
- BPlanning
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

