OU Convocation | వచ్చే నెల 19న ఓయూ స్నాతకోత్సవం.. ముఖ్యఅతిథిగా ఇస్రో చైర్మన్ నారాయణన్
OU Convocation | ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చేనెల 19న నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్లర్ జిష్ణు దేవ్ వర్మ అధ్యక్షత వహించనున్నారు.
OU Convocation | ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవాన్ని వచ్చేనెల 19న నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరించనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్లర్ జిష్ణు దేవ్ వర్మ అధ్యక్షత వహించనున్నారు.
కాగా, పట్టాలు తీసుకోనున్న అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు ప్రకటన వెలువరించారు. 2022-23, 2023-24 విద్యాసంవత్సరాలలో అన్ని డిప్లొమా, యూజీ, పీజీ, ఎంఫిల్ తదితర కోర్సులు పూర్తి చేసి బంగారు పతకాలు పొందినవారు (దూరవిద్యా విధానంతో సహా) స్నాతకోత్సవంలో తమ పట్టాలు, పతకాలు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీ వరకు పీహెచ్డీ పట్టాలు పొందినవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలోకి ప్రవేశించి సంబంధిత రుసుము చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
అన్ని పీహెచ్డీ పట్టాలు, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులకు సంబంధించిన బంగారు పతకాలన్నింటినీ స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. యూజీ బంగారు పతకాలను స్నాతకోత్సవం అనంతరం సంబంధిత కళాశాలల నుంచి పొందవచ్చన్నారు. శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లు తెలిపారు. స్నాతకోత్సవంలో పట్టాలు స్వీకరించదలిచిన వారు వచ్చే నెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

