‘ఎస్ఎస్సీ’ 8326 ఖాళీలు
‘ఎస్ఎస్సీ’ 8326 ఖాళీలు
- పదోతరగతితో కేంద్రంలో కొలువులు
- ఎంటీఎస్, హవల్దార్ పోస్టులు
- తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు
- కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్స్సీ) ప్రకటన విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 8326
- పోస్టుల వారీగా ఖాళీలు: మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ – 4887, హవల్దార్ (గ్రూప్ సీ నాన్ మినిస్టీరియల్)- 3439 ఖాళీలు ఉన్నాయి
- అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన వారు అర్హులు
- వయస్సు: 2024, ఆగస్టు 1 నాటికి ఎంటీఎస్ పోస్టులకు 18- 25 ఏండ్లు, హవల్దార్ పోస్టులకు 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎంటీఎస్ పోస్టులకు
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తారు
హవల్దార్ పోస్టులకు
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) ద్వారా
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను ఇంగ్లిష్/హిందీతోపాటు 13 స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు.
- తెలుగులో కూడా పరీక్ష రాయవచ్చు
- ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
- సీబీఈలో రెండు సెషన్లు ఉంటాయి.
- మొదటి సెషన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ప్రాబ్లమ్ సాల్వింగ్పై ప్రశ్నలు ఇస్తారు
- పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు.
- ప్రశ్నల సంఖ్య 40. మార్కులు 120
- సెషన్-2లో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 150 మార్కులు. అంటే ఒక్క ప్రశ్నకు 3 మార్కులు.
- పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు
నోట్: సెషన్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. సెషన్-2లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకుఒక మార్కును కోతవిధిస్తారు.
పీఈటీ
- హవల్దార్ పోస్టులకు నిర్వహించే పీఈటీలో పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో నడవాలి. మహిళలు అయితే ఒక కిలోమీటరు దూరాన్ని 20 నిమిషాల్లో నడవాలి.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)
- పురుషులు కనీసం 157.5 సెంమీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 81 సెం.మీ. గాలి పీల్చినప్పుడు కనీసం ఐదు సెం.మీ వ్యాకోచించాలి.
- మహిళలు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. బరువు 48 కేజీలు ఉండాలి.
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: జూలై 31
- పరీక్ష తేదీలు: అక్టోబర్/నవంబర్ 2024
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
- వెబ్సైట్: https://ssc.gov.in
హెచ్సీఎల్లో…
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్)లో కింది
పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 56
పోస్టులు: జూనియర్ మేనేజర్
విభాగాలు: మైనింగ్, ఎలక్ట్రికల్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్, హెచ్ఆర్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 22
వెబ్సైట్: www.hindustancopper.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

