వాయిదాపడిన నెస్ట్.. దరఖాస్తు గడువు పొడిగింపు
నెస్ట్| కరోనా నేపథ్యంలో మరో ప్రవేశ పరీక్ష వాయిదాపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్)-2021 వాయిదాపడింది

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మరో ప్రవేశ పరీక్ష వాయిదాపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్)లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్)-2021 వాయిదాపడింది. దీంతో దరఖాస్తు గడువుతోపాటు, పరీక్ష తేదీని పొడిగించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్లో నెస్ట్ పరీక్షను వాయిదావేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పరీక్షను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. దరఖాస్తు గడువును జూలై 15 వరకు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈనెల 7న ముగుస్తుండగా, ప్రవేశ పరీక్ష 14న జరగాల్సి ఉన్నది.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా యూనివర్సిటీ ఆఫ్ ముంబై, భువనేశ్వర్‌లోని నైసర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్లో 60 శాతం మార్కులతో పాసైనవారు నెస్ట్ పరీక్ష రాయడానికి అర్హులు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

