చర్యాశీలత లేనిది… జీవ విచ్ఛిన్నం కానిది
మెట్రో రసాయనాల నుంచి తయారయ్యే దారాలను ‘కృత్రిమ దారాలు’ అంటారు. పాలిమర్: ఒకే విధమైన చిన్నచిన్న అణువులన్నీ కలిసి ఏర్పడే పెద్ద అణువును ‘పాలిమర్' అంటారు.
ప్లాస్టిక్-ఉపయోగాలు-నష్టాలు
కృత్రిమ దారాలు
- మెట్రో రసాయనాల నుంచి తయారయ్యే దారాలను ‘కృత్రిమ దారాలు’ అంటారు.
- పాలిమర్: ఒకే విధమైన చిన్నచిన్న అణువులన్నీ కలిసి ఏర్పడే పెద్ద అణువును ‘పాలిమర్’ అంటారు.
- నైలాన్: నేలబొగ్గు, నీరు, గాలి నుంచి తయారు చేసిన కృత్రిమ దారాన్ని ‘నైలాన్’ అంటారు.
- స్పిన్నరెట్ : అతిచిన్న రంధ్రాలు కలిగి లోహపు పళ్లెం నుంచి పాలిఎమైడ్ల ఘనపు ముక్కలను కరిగించి తోయడం.
- రేయాన్: సెల్యూలోజ్‌తో తయారు చేసిన కృత్రిమ పట్టుదారాన్ని ‘రేయాన్’ అంటారు.
- మిశ్రణం: ఏదైనా కృత్రిమ దారాన్ని రెండు లేదా ఎక్కువ ఇతర దారాలతో కలిపే ప్రక్రియను ‘మిశ్రణం’ అంటారు.
- అక్రలిక్: నేలబొగ్గు, గాలి, నీరు, నూనె, సున్నపురాయి నుంచి తయారుచేసిన దారాన్ని ‘అక్రలిక్” అంటారు.
- టెరిసిల్క్: టెర్లిన్ సిల్క్‌తో మిశ్రణం చేయటాన్ని ‘టెరిసిల్క్’ అంటారు.
- టెరి ఊల్: టెర్లిన్ను ఊల్‌తో మిశ్రణం చేయటాన్ని ‘టెరి ఊల్’ అంటారు.
- రీసైక్లింగ్: విరిగిపోయిన, వాడలేని, పాతబడిన ప్లాస్టిక్‌లను వివిధ పద్ధతుల్లో శుభ్రపరచి తిరిగి కొత్త వస్తువులను తయారు చేయటాన్ని ‘రీసైక్లింగ్’ అంటారు.
- 4R ల సూత్రం: ప్లాస్టిక్‌లను తగ్గించడం, రీసైకిల్ చేయడం, తిరిగి వాడటం, తిరిగి పొందటాన్ని 4R ల సూత్రం అంటారు. (Re duce, Recycle, Reuse, Recover)4Rలు
1. వాడకం తగ్గించడం: ప్లాస్టిక్‌ల విచక్షణారహిత వాడకాన్ని తగ్గించడం.
2. రీసైకిల్: పాత వస్తువులను సేకరించి వాటిని తిరిగి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చడం.
3. తిరిగి వాడటం: మనం వస్తువులను కొని ఇంటికి తెచ్చేటప్పుడు ప్రతిసారీ ప్లాస్టిక్ సంచులను కొని వాటిలో తెస్తాం. తర్వాత ఒక మూలన పడేస్తాం. వీటిలో కొన్ని తిరిగి వాడవచ్చు. లేదా వాటిని వాడటానికి సుముఖంగా ఉన్నవారికి ఇవ్వవచ్చు.
4. తిరిగి పొందటం: ఘన వ్యర్థాల నిర్వహణ విధానంలో పాటించవలసిన అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది. సేకరించిన వ్యర్థాల నిర్వహణలో తిరిగి పొందడం అనే సూత్రం ప్రధానమైనది. ఈ వ్యర్థాలను విద్యుత్తు, ఉష్ణం, కంపోస్ట్, ఇంధనాలు వంటి వివిధ రూపాల్లోకి మార్చి తిరిగి వనరులుగా ఉపయోగించవచ్చు.
- థర్మోప్లాస్టిక్: వేడి చేసినప్పుడు ముడుచుకుపోయే, వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్‌లను ‘థర్మో ప్లాస్టిక్లు’ అంటారు.
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్
ప్లాస్టిక్‌లను ఒకసారి మలిచిన తర్వాత వేడి చేయటం ద్వారా మృదువుగా మార్చలేకపోతే అటువంటి ప్లాస్టిక్‌లను ‘థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్’ అంటారు.
జీవ విచ్ఛిన్నం చెందేవి: సహజ ప్రక్రియ ద్వారా పదార్థాలు సులువుగా వియోగం చెందితే ఆ పదార్థాలను ‘జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు’ అంటారు.
జీవ విచ్ఛిన్నం చెందనివి: సహజ ప్రక్రియ ద్వారా వియోగం చెందకపోతే వాటిని ‘జీవ విచ్ఛిన్నం చెందని పదార్థాలు’ అంటారు.
ప్లాస్టిక్ ఉపయోగాలు
- ప్లాస్టిక్ నీరు, ఇతర రసాయనాలతో చర్య జరపదు.
- క్షయం చేయదు
- ప్లాస్టిక్ చాలా తేలికైనది, దృఢమైనది, మన్నికైనది.
- ప్లాస్టిక్ పరిమాణంలోనే, విభిన్న రూపాల్లోకి మలచగలిగేదిగా ఉంటుంది.
- ప్లాస్టిక్ వస్తువులు లోహాల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
- ప్లాస్టిక్ ఉష్ణ సంబంధ, విద్యుత్తు బంధక పదార్థాలు.
- ప్లాస్టిక్ వివిధ రంగుల్లో తయారు చేసుకోవచ్చు.
- పై కారణాల వల్ల ప్లాస్టిక్ పాత్రలను, వస్తువులను భద్రపరుచుకొనేందుకువాడుతారు.
ప్లాస్టిక్ ధర్మాలు
1. ప్లాస్టిక్ చర్యాశీలత లేనిది, క్షయం గాని పదార్థం.
2. తేలికైనది, దృఢంగా ఉండే పదార్థం.
3. దీన్ని మనకు కావలసిన వివిధ ఆకృతుల్లో మార్చవచ్చు.
4. విద్యుత్తు బంధక పదార్థం.
5. అధమ విద్యుత్తు వాహకాలు.
పాలిస్టర్ ధర్మాలు
1. పాలిస్టర్ ముడతలు పడదు.
2. ఇది బలంగా, తేలికగా ఉంటుంది.
3. తక్కువ నీటిని శోషణం చేసుకుంటుంది.
4. ఇది త్వరగా ఆరిపోతుంది.
5. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
6. అధిక ఒత్తిడిని తట్టుకోగలదు.
పాలిస్టర్ ఉపయోగాలు
1. పాలిస్టర్ ప్యాంట్స్, షర్ట్స్, సూట్స్, దుప్పట్లు తయారు చేయటానికి ఉపయోగిస్తారు.
2. దీన్ని ప్లాస్టిక్ సీసాలు, ఫిల్మ్‌లు, వైర్లు బకెట్ల తయారీలో ఉపయోగిస్తారు.
3. పాలిస్టర్‌ను మిగిలిన దారాలతో మిశ్రణం చేయడానికి ఉపయోగిస్తారు.
నైలాన్ ధర్మాలు
1. నైలాన్ దారం బలంగా, స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది.
2. ఇది మెరుపును కలిగి ఉంటుంది.
3. ఇది తేలికైనది, అధిక ఒత్తిడిని తట్టుకోగలదు.
4. ఇది తక్కువ నీటిని పీల్చుకుంటుంది, త్వరగా ఆరుతుంది.
5. ఇది మన్నికైనది.
5. ఇది ముడతలు పడదు.
నైలాన్ ఉపయోగాలు
1. నైలాన్‌తో బ్రష్ కుంచె, తాళ్లు, చేపల వలలు, టెంట్ తాళ్లు, పారాచూట్ తాళ్లు తయారు చేస్తారు.
2. నైలాన్‌తో చీరలు, స్త్రీల మేజోళ్లు, గుడారాలు, బెల్టులు తయారు చేస్తారు.
3. ఈత దుస్తులు, లోదుస్తులు, తెరచాపలు, గొడుగులు, బట్టలు కార్లటైర్లు తయారు చేస్తారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

