హైదరాబాద్: సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హతక లిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 14 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ సెక్రటేరియట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని భువనేశ్వర్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 14
ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 9, సెక్రటేరియట్ అసిస్టెంట్ 3, జూనియర్ స్టెనోగ్రాఫర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా చేసి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఉండాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభం: మే 20
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21
వెబ్సైట్: www.immt.res.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి