న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ వైద్య విద్యా సంస్థ అయిన జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (JIPMER) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నది. వచ్చే నెల 1 వరకు ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అర్హులైనవారు అప్లయ్ చేసుకోవచ్చు. మొత్తం 433 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. 80 శాతం పోస్టులను మహిళా అభ్యర్థులకు కేటాయించారు.
మొత్తం పోస్టులు: 433
ఇందులో జనరల్ 175, ఈడబ్ల్యూఎస్ 43, ఓబీసీ 116, ఎస్సీ 66, ఎస్టీ 33 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: నర్సింగ్‌లో బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్‌లో ఏదోఒకటి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
రాతపరీక్ష: 2022, డిసెంబర్ 18
దరఖాస్తులకు చివరితేదీ: 2022, డిసెంబర్ 1
వెబ్సైట్: https:://www.jipmer.edu.in