న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో అప్రెంటింస్లను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు వచ్చేనెల 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1535 అప్రెంటిస్షిప్ పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 1535
ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ అట్టెండెంట్ ఆపరేటర్ 396, ఫిట్టర్ 161, బాయిలర్ 54, డాటాఎంట్రీ ఆపరేటర్ 73, సెక్రటేరియల్ అసిస్టెంట్ 39, అకౌంటెంట్ 45, టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్ 361, కెమికల్ 332, ఎలక్ట్రికల్ 198, ఇన్స్ట్రుమెంటేషన్ 74 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 23
వెబ్సైట్: www.iocl.com