ప్రదేశం: ఇది అండమాన్, నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ ఐలాండ్‌లో గల ‘క్యాంప్‌బెల్ బే’ సమీపంలో ఉన్న ఒక భారతీయ నౌకాదళ వైమానిక కేంద్రం
ప్రారంభం: దీన్ని 2012, జూలై 31న అధికారికంగా ప్రారంభించారు
ప్రత్యేకత: నికోబార్ దీవుల్లో ఏర్పాటైన మొట్టమొదటి వైమానిక కేంద్రం ఇదే. అంతేకాకుండా, భారత సాయుధ దళాలకు చెందిన అత్యంత దక్షిణాన ఉన్న వైమానిక కేంద్రం కూడా ఇదే
కావడం విశేషం.
కమాండ్ పరిధి: ఇది భారత సాయుధ దళాల ఉమ్మడి సేవల విభాగమైన అండమాన్, నికోబార్ కమాండ్(ANC) పరిధిలో పనిచేస్తుంది.
నిఘా, నిరంతర పర్యవేక్షణ: హిందూ మహాసముద్రంలోని విస్తారమైన ప్రాంతాల్లో నిఘా సమాచారాన్ని సేకరించడం, నిరంతర పర్యవేక్షణ, శత్రువుల కదలికలను గుర్తించడం వంటి విషయాల్లో ఇది భారతదేశ సామర్థ్యాన్ని ఎంతగానో పెంచుతుంది.
వ్యూహాత్మక ప్రదేశం: ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య జలసంధి అయిన మలక్కా జలసంధితో పాటు, గ్రేట్ నికోబార్, ఇండోనేషియాకు చెందిన సుమత్రా దీవుల మధ్య ఉన్న ‘సిక్స్ డిగ్రీ ఛానల్’పై ఇది పూర్తి నిఘా ఉంచుతుంది.
ప్రసుత్తం దీన్ని భారత నౌకాదళానికి చెందిన డార్నియర్ డో 228 నిఘా విమానాల బేస్‌గా ఉపయోగిస్తున్నారు. అలాగే, భారత వైమానిక దళానికి చెందిన భారీ రవాణా విమానం C-130J సూపర్ హెర్క్యులస్ (Super Hercules) కూడా ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగించగలదు.
రన్‌వే విస్తరణ : ప్రస్తుతం ఇక్కడి రన్‌వే పొడవు 3,500 అడుగులు (1,100 మీటర్లు) ఉంది. అన్ని రకాల భారీ విమానాలు ఇక్కడి నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా దీన్ని దశలవారీగా పొడిగించనున్నారు.
1. INS బాజ్ ఎక్కడ ఉంది?
అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్
(క్యాంప్‌బెల్ బే).
2. భారత సాయుధ దళాల అత్యంత దక్షిణాన ఉన్న ఎయిర్ స్టేషన్ ఏది?
INS బాజ్.
3. ఇది ఏ జలసంధిపై నిఘా ఉంచుతుంది?
మలక్కా జలసంధి, సిక్స్ డిగ్రీ ఛానల్.