JEE Advanced | మే 26న జేఈఈ అడ్వాన్స్డ్-2024 పరీక్ష.. ఏప్రిల్ 21 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష తేదీని ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష తేదీని ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 21న ప్రారంభమవుతుంది. అదే నెల 30న దరఖాస్తులు ముగుస్తాయి. మే 6న ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి గడువు ముగియనుంది. మే 17 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 26న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహించనున్నారు.
ప్రాథమిక కీని మే 31న విడుదల చేయనున్నారు. ఫైనల్ కీ తోపాటు పరీక్ష ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్-2024 (JEE Main) క్వాలిఫై అయిన అభ్యర్థులు అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. జేఈఈ మెయిన్ దరఖాస్తులు నవంబర్ 30న ముగియనున్నాయి. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్నది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 21
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 30
ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 6
అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: మే 17
పరీక్ష తేదీ: మే 26
ప్రైమరీ కీ: మే 31
ఫైనల్ కీ, ఫలితాలు: జూన్ 9
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

