హైదరాబాద్: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) జులై సెషన్కుగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నది. ఆసక్తికలిగిన వారు జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకులు కే. రమేశ్ తెలిపారు. వర్సిటీలో సర్టిఫికేట్, డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎంపిక చేయబడిన ప్రోగ్రాముల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తి రాయితీ కల్పిస్తున్నామని వెల్లడించారు. అయితే మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాములకు ఎలాంటి రాయితీలు ఉండవని తెలిపారు. ఆన్లైన్ అడ్మిషన్ల కోసం www.ignou.ac.in లేదా 9492451812, 040-23117550 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.