ముంబై: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి IBPS దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. పీజీలో సైకాలజీ చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. అయితే పోస్టుల సంఖ్యను ఐబీపీఎస్ స్పష్టం చేయలేదు.
పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్
అర్హతలు: పీజీలో సైకాలజీ, ఎడ్యుకేషన్, సైకలాజికల్ మెజర్మెంట్, సైకోమెట్రిక్స్, మేనేజ్మెంట్ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్లలోపు వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులకు చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.ibps.in