గ్రూప్స్ ప్రత్యేకం తెలంగాణ చరిత్ర
1. కింది నృత్యరూపాల్లో ఏది యుద్ధవీరుల నృత్యంగా పేరు గాంచింది?
1) కోలాటం
2) పేరిణి శివతాండవం
3) భరత నాట్యం 4) కథాకళి
2. కోడెను కట్టు సంప్రదాయం తెలంగాణలోని ఏ దేవాలయంలో ఉంది?
1) రాజరాజేశ్వర దేవాలయం -వేములవాడ
2) సోమేశ్వర దేవాలయం -పాలకుర్తి
3) వీరభద్ర దేవాలయం – కురవి
4) లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదాద్రి
3. తెలంగాణ రాష్ట్రంలో సాధనా శూరులు ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు?
1) గొల్లకురుమ 2) గౌండ్ల ఈడిగ
3) పెరిక బలిజ 4) పద్మశాలి
4. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా… అనే పాటను ఎవరు రచించారు?
1) అభినయ శ్రీనివాస్
2) దరువు ఎల్లన్న
3) మిట్టపల్లి సురేందర్
4) నందిని సిధారెడ్డి
5. హైదరాబాద్‌లో నిజాం నిర్మించిన థియేటర్ పేరు ఏది?
1. సెలెక్ట్ టాకీస్ 2) బసంత్ టాకీస్
3) సినిమా ఘర్ 4) నిషాంత్ టాకీస్
6. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించిన మొదటి భవనం ఏది?
1) ఇంజినీరింగ్ కళాశాల
2) లా కళాశాల 3) ఆర్ట్స్ కళాశాల
4) రసాయన శాస్త్ర భవనం
7. కింది ప్రముఖుల్లో ఎవరికి ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది?
ఎ) సి. రాజగోపాలచారి
బి) వై. నాయుడమ్మ
సి) జాకీర్ హుస్సేన్
డి) డా. అబ్దుల్ కలాం
1) ఎ, డి 2) సి, డి
3) ఎ, బి 4) బి, సి
8. మధ్యయుగాల తెలంగాణ గ్రంథం రంగనాథరామాయణం ఎవరికి సంబంధించింది?
1) బమ్మెర పోతన
2) పాల్కురికి సోమనాథుడు
3) గోన బుద్ధారెడ్డి
4) వేములవాడ భీమకవి
9. కింది వారిలో తెలంగాణకు చెందిన హిందీ సినిమా దర్శకులు ఎవరు?
1) లక్ష్మీకాంత్ , ప్యారేలాల్
2) శ్యాంబెనెగల్, నగేష్‌కుకునూర్
3) గురదత్, మహేష్‌భట్
4) ఖ్వాజా అహ్మద్ అబ్బాస్, అక్కు అక్బర్
10. 1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించిన కమిటీ ఏది?
1) శ్రీ కృష్ణ కమిటీ
2) జయభారత రెడ్డి కమిటీ
3) వాంఛూ కమిటీ
4) వశిష్ఠ భార్గవ కమిటీ
11. మీర్ తురాబ్ అలీఖాన్ ఏ పేరుతో ప్రఖ్యాతి గాంచారు?
1) సాలార్ జంగ్
2) నసీర్-ఉద్-దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) అఫ్జల్-ఉద్-దౌలా
12. పూర్వపు నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం ఎవరి గురించి తెలుపుతుంది?
1) చాళుక్యులు 2) రాష్ట్రకూటులు
3) శాతవాహనులు
4) విష్ణుకుండినులు
13. ఏ సమస్యపై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలీపై బషీర్‌బాగ్ పోలీసు కాల్పుల సంఘటన జరిగింది?
1) ధరల పెరుగుదల
2) రేప్ సంఘటన
3) అవినీతి
4) విద్యుత్ చార్జీల పెరుగుదల
14. తెలంగాణ డాక్టర్స్ ఫోరం అధ్యక్షుడు ఎవరు?
1) పి. అశోక్ కుమార్
2) పి. హరినాథ్
3) ఎ. గోపాలకిషన్ రావు
4) మధు రెడ్డి
15. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయ మూర్తి ఎవరు?
1) జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
2) జస్టిస్ జె. చలమేశ్వర్
3) జస్టిస్. ఎల్. నర్సింహారెడ్డి
4) జస్టిస్ బి. చంద్రకుమార్
16. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతరను ఏ వంశీయులు పూజలు చేసి ప్రారంభిస్తారు?
1) లంబాడీ వంశీయులు
2) గొత్తికోయ వంశీయులు
3) మెస్రం వంశీయులు
4) గోండు వంశీయులు
17. బోనాల పండగ సందర్భంగా వీధుల్లో చేసే నృత్యం ఏది?
1) రేల 2) గరగ
3) థింసా 4) గుస్సాడి
18. కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు?
1) రాపోలు ఆనంద భాస్కర్
2) రాపోలు అంజయ్య
3) ప్రణయ భాస్కర్
4) విజయ భాస్కర్
19. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు?
1) మాఘం 2) ఆశ్వయుజం
3) ఆషాఢం 4) భాద్రపదం
20. అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధి నవల ఏది?
1) కాల రేఖలు
2) భూమి పుత్రుడు
3) సలాం హైదరాబాద్
4) జీవన సమరం
21. ముంగిలి తెలంగాణలోని ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారు ఎవరు?
1) బోయ జంగయ్య
2) సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
3) జూలూరి గౌరీ శంకర్
4) సి. నారాయణరెడ్డి
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. తెలంగాణ చరిత్రలో ప్రస్తావించిన బిక్కవోలు అనే ప్రాంతాన్ని నేడు ఏమని పిలుస్తారు?
1) బిక్నూర్ 2) బిచ్కుంద
3) భువనగిరి 4) బాన్సువాడ
2. నిర్మల్ బొమ్మల కోసం ఉపయోగించే కర్ర ఏది?
1) సాల్ కర్ర 2) టేకు కర్ర
3) పునికి కర్ర 4) గంధపు కర్ర
3. జై బోలో తెలంగాణ చిత్ర సంగీత దర్శకుడెవరు?
1) దేవీశ్రీప్రసాద్ 2) కీరవాణి
3) వందేమాతరం శ్రీనివాస్
4) చక్రి
4. కాళేశ్వరం దేవాలయంలో ప్రధాన దైవ స్వరూపం ఏది?
1) ఆంజనేయస్వామి
2) వేంకటేశ్వర స్వామి
3) పరమశివుడు 4) శ్రీరాముడు
5. తెలంగాణలో దసరాపండుగ సందర్భం గా కింది ఆచారాలు పాటిస్తారు. వీటిలో భిన్నమైనవి?
1) బంగారం ఇచ్చిపుచ్చుకోవడం
2) ఆరోజు ఉపవాసం పాటించడం
3) జమ్మికొట్టడం
4) పాలపిట్టను చూడటం
6. కిందివాటిలో సరిగా లేని జతను గుర్తించండి?
1) ఐతారం- ఆదివారం
2) సోపతి -స్నేహం
3) తాతీల్లు – సెలవులు
4) తబాదల -పోస్టాఫీసు
7. తెలంగాణ వ్యాప్తంగా అనేక ఇళ్లల్లో ‘పాన్ దాన్’ పేరుతో కనిపించే ఒక వస్తువు?
1) ప్రథమ చికిత్స సామగ్రి పెట్టే
2) నమలడానికి ఉపయోగించే తమలపాకులు, ఇతర సామగ్రి ఉండే పెట్టే
3) వ్యవసాయ పనిముట్లను భద్రపరిచే పెట్టే
4) కళ్ళద్దాలు భద్రపరిచే పెట్టే
8. నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ పాటను రాసిందెవరు?
1) నందిని సిధారెడ్డి
2) దేశపతి శ్రీనివాస్
3) గోరెటి వెంకన్న
4) అందెశ్రీ
9. కింది వాటిని వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా క్రమపద్ధతిలో తెలపండి?
ఎ) ఉస్మానియా జనరల్ హాస్పిటల్
బి) సిటీకాలేజ్
సి) ఉస్మానియా యూనివర్సిటీ
డి) నిజాం కాలేజీ
1) బి, డి, సి, ఎ 2) డి, సి, బి, ఎ
3) బి, సి, డి, ఎ 4) డి, బి, సి, ఎ
10. కుతుబ్ షాహీ రాజ్య చివరి పాలకుడు ఎవరు?
1) అబ్దుల్లా కుతుబ్‌షా
2) అబుల్ హసన్ తానీషా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
11. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ ఉంది?
1) హైదరాబాద్ 2) వరంగల్
3) విజయవాడ 4) ఆనంతపురం
12. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన విశ్వవిద్యాలయం ఏది?
1) ఉస్మానియా విశ్వవిద్యాలయం
2) ఆంధ్ర విశ్వవిద్యాలయం
3) కాకతీయ విశ్వవిద్యాలయం
4) తెలంగాణ విశ్వవిద్యాయలం
13. హైదరాబాద్‌లో నిజాం పాలనలో ఏర్పాటు చేసిన అంతరిక్ష ఖగోళ పరిశోధన కేంద్రం పేరు?
1) లుంబినీ ఖగోళ పరిశోధన కేంద్రం
2) బిర్లా ఖగోళ పరిశోధన కేంద్రం
3) నిజామియా ఖగోళ పరిశోధనా కేంద్రం
4) సికింద్రాబాద్ ఖగోళ పరిశోధనా కేంద్రం
14. భువనగిరి సభ ఎప్పుడు జరిగింది?
1) 1995 2) 1996
3) 1997 4) 1998
15. మిలియన్ మార్చ్‌ను ఎప్పుడు నిర్వహించారు?
1) 10 ఏప్రిల్ 2011
2) 10 మార్చి 2011
3) 11 ఏప్రిల్ 2011
4) 11 మార్చి 2011
16. గన్‌పార్కులో తెలంగాణ అమరవీరుల స్థూపానికి శంకుస్థాపన చేసిన వ్యక్తి ఎవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) సదా లక్ష్మి
3) లక్ష్మీ నారాయణ
4) జి. వెంకటస్వామి
17. టీఆర్ఎస్ రెండో వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు?
1) సింహగర్జన 2) జైత్రయాత్ర
3) పొలికేక 4) శంఖారావం
18. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో దీక్ష నిర్వహించిన స్వాతంత్య్ర సమరయోధులు ఎవరు?
1) బూర్గుల నర్సింగరావు
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) సదాలక్ష్మి
4) జి. వెంకటస్వామి
19. తెలంగాణ ఉద్యమ కాలంలో సాగిన వినూత్న నిరసన రూపం ఏది?
1) బహిరంగ సభ 2) ర్యాలీ
3) వంటావార్పు 4) ధర్నా
20. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఉద్యమకారుడు ఎవరు?
1) గిరియాదవ్ 2) నాగరాజు
3) ఇషాంత్‌రెడ్డి 4) యాది రెడ్డి
21. సిద్దిపేటలో దీక్ష కోసం బయలుదేరిన కేసీఆర్ ను ఆరెస్ట్ చేసి ఏ జైలులో బంధించారు?
1) వరంగల్ 2) కరీంనగర్
3) ఖమ్మం 4) నిజామాబాద్
22. కింది వారిలో జల్ జంగిల్, జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ 2) కుమ్రం భీం
3) రామానంద తీర్థ 4) వినోబాభావే
23. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు?
1) స్వామిగౌడ్
2) పద్మాదేవేందర్ రెడ్డి
3) మధుసూదనాచారి
4) ఈటెల రాజేందర్