1. కింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు?
1) నిజాం అలీఖాన్ ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు
2) 1839లో హైదరాబాద్లో వహాబీ కుట్ర జరిగింది
3) 1854లో నిజాం ప్రభుత్వం, ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ బీరార్ ఒప్పందంపై సంతకాలు చేశాయి
4) 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్గా కల్నల్ డేవిడ్ సన్ ఉన్నాడు
2. జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
1) రాంజీ గోండ్ 2) బిర్సాముండా
3) కుమ్రం భీమ్ 4) హాజీ గోండ్
3. నిజాం రాజ్యంలో హోలి సిక్కా రూపాయిని ఎవరు ప్రవేశ పెట్టారు?
1) మొదటి సాలార్జంగ్
2) రెండో సాలార్జంగ్
3) మూడో సాలార్జంగ్
4) నాలుగో సాలార్జంగ్
4. 20వ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజినీర్ ఎవరు?
1) నవాబ్ అలీ యావర్ జంగ్
2) నవాబ్ అలీ నవాజ్ జంగ్
3) నవాబ్ మీర్జా నవాబ్ జంగ్
4) నవాబ్ మీర్జా మోయిన్ జంగ్
5. కిందివారిలో ఎవరు కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహూకరించారు?
1) హుస్సేన్ షా వలీ
2) మహ్మద్ సయీద్ (మీర్ జుమ్లా)
3) షేక్ మహ్మద్ (ఇబన్ ఖాతూన్ )
4) ఖైరత్ఖాన్
6. కుమ్రంభీమ్ ఎక్కడ జన్మించాడు?
1) బడే ఘాట్ 2) ఇంద్రవెల్లి
3) జోడేఘాట్ 4) ఉట్నూర్
7. కింది వాటిని జతపరచండి?
జాబితా -1 జాబితా -2
ఎ) నీలగిరి పత్రిక 1) సురవరం ప్రతాపరెడ్డి
బి) రయ్యత్ 2) షబ్నవీస్ నరసింహారావు
సి) జనధర్మ 3) మందుముల నరసింగరావు
డి) గోల్కొండ పత్రిక
4) ఎం. శ్రీనివాస చార్య
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-1, బి-2, సి-3, డి-4
8. ప్రతిపాదన(ఎ): హైదరాబాద్ రాష్ట్రంలో 20వ శతాబ్దం తొలిపాదంలో అనేక పత్రికలు ప్రారంభమయ్యాయి.
కారణం(ఆర్): హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను చైతన్య పరచడంలో ప్రెస్ క్రియాశీల పాత్ర పోషించింది.
1) (ఎ), (ఆర్) రెండు సరైనవే, (ఆర్) కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండు నిజం కానీ (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
9. ప్రతిపాదన(ఎ): మొదటి సాలార్జంగ్ 1868లో ముల్కీలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు.
కారణం(ఆర్): స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించడం వల్ల ముల్కీల్లో అసంతృప్తి ప్రబలింది.
1) (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్) కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం కానీ
(ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
10. నానాఘాట్ శాసనాన్ని వేయించింది?
1) బాలశ్రీ 2) దేవి నాగానిక
3) వేదశ్రీ 4) శాంతిశ్రీ
11. శాతవాహనుల కాలంలో కింది ఏ రేవు పట్టణం ప్రముఖమైంది?
1) బరుకచ్ఛ (బరిగజ) 2) నాసిక్
3) ధరణికోట 4) కళ్యాణ
12. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
1) హాలుడు గాథాసప్తశతి
2) గుణాఢ్యుడు బృహత్కథ
3) బాలశ్రీ నాసిక్ శాసనం
4) నాగానిక ఎల్లోరా శాసనం
13. కింది వాటిని జతపరచండి?
ఎ) నేలకొండపల్లి 1) జైన కేంద్రం
బి) కొలనుపాక 2) బౌద్ధ స్థూపం
సి) అలంపూర్ 3) హిందూ దేవాలయం
డి) కన్హేరి 4) బౌద్ధ చైత్యం
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-4, బి-2, సి-3, డి-1
14. ప్రతిపాదన(ఎ): శాతవాహనుల కాలంలో బౌద్ధమతం ఉన్నత దశకు చేరింది.
కారణం(ఆర్): శాతవాహనుల కాలంనాటి చిత్ర లేఖనాలు అజంతా గుహల్లో కలవు.
1) (ఎ), (ఆర్) రెండూ నిజం,
(ఆర్) కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం కానీ (ఎ) కు (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
15. కింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు?
1) కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు
2) యాదవులు కాకతీయ రాజ్యంపై
దండయాత్ర చేశారు
3) తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల ఆధీనంలో ఉండేవి
4) కాకతీయులు పాండ్యులతో పోరాడారు
16. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది?
1) భరతనాట్యం 2) పేరిణీ నృత్యం
3) కూచిపూడి నృత్యం
4) కథాకళి నృత్యం
17. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి?
1) హనుమకొండ శాసనం రుద్రదేవ
2) బయ్యారం చెరువు శాసనం- మేడాంబ
3) పాలంపేట శాసనం – రేచర్ల రుద్రుడు
4) మోటుపల్లి శాసనం – గణపతి దేవుడు
18. సమ్మక్క-సారక్క ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పాయారు?
1) రుద్రదేవుడు 2) గణపతి దేవుడు
3) రుద్రమదేవి 4) ప్రతాపరుద్రుడు
19. కింది వాటిని జతపరచండి?
ఎ) వేయిస్తంభాల గుడి
1) నృత్యరత్నావళి
బి) రుద్రమదేవి 2) మొట్టమొదటి
సార్వభౌమ
కాకతీయ రాజు
సి) రుద్రదేవుడు 3) నాయంకర
విధానం
డి) జాయప 4) హనుమకొండ
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-1, బి-2, సి-3, డి-4
20. కుతుబ్షాహీల కాలంలో ‘సతి’ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు?
1) టావెర్నియర్ 2) మెథోల్డ్
3) బెర్నియర్ 4) థామస్ బౌరీ
21. కింది వాటిని జతపరచండి?
జాబితా-1 జాబితా -2
ఎ) మహ్మద్ కులీ 1) 1612
బి) జంషీద్ 2) 1550
సి) ఇబ్రహీం కుతుబ్షా 3) 1543
డి) మహమ్మద్ కుతుబ్షా 4) 1518
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-2, సి-4, డి-1
22. హైదరాబాద్ రాష్ట్రంలో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
1) 1882 2) 1883
3) 1884 4) 1885
23. మహ్మద్ కులీ కుతుబ్షా రచనలు ఏ పేరుతో ముంద్రించారు?
1) ఖబులియత్ 2) దిల్ఖుష్
3) ప్యారాగీత్ 4) ఖులియత్
24. నిజాం ఉల్-ముల్క్ అసలు పేరు?
1) మీర్ కమ్రుద్దీన్ 2) చిన్కిలిచ్ ఖాన్
3) ఫతేజంగ్ 4) అసఫ్జా
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. బోనాల పండుగ సందర్భంగా సికింద్రా బాద్లో వండిన అన్నం ఎవరికి సమర్పిస్తారు?
1) కలకత్తా కాళికి
2) ఉజ్జయిని మహంకాళికి
3) రేణుక ఎల్లమ్మకు
4) పెద్దమ్మకు
2. షోయబుల్లాఖాన్ సంపాదకత్వంలో వెలువడిన వార్తాపత్రిక పేరు?
1) ఇమ్రోజ్ 2) రయ్యత్
3) భాగ్యనగర్
4) దక్కన్ క్రానికల్
3. పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు?
1) వల్లభాచార్య
2) రుద్రదేవ
3) పాల్కురికి సోమనాథుడు
4) గణపతి దేవుడు
4. నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్కు ఎవరి పేరు పెట్టారు?
1) అలీ యావర్
2) అలీ నవాజ్ జంగ్
3) అలీ సూర్ జంగ్
4) మహ్మద్ అలీ మీర్జా
5. బతుకమ్మ చివరి రోజును ఏమంటారు?
1) సద్దుల బతుకమ్మ
2) మహదేవ బతుకమ్మ
3) సత్య బతుకమ్మ
4) పూర్ణ బతుకమ్మ
6. ఫణిగిరి అనే గ్రామం దేనికి ప్రసిద్ధి?
1) శివుని దేవాలయం
2) శ్రీరాముని దేవాలయం
3) బుద్ధుని క్షేత్రం
4) జైన దేవాలయం
7. మండి సినిమా కథా వస్తువు?
1) వరంగల్ ధాన్యం మార్కెట్ కథ
2) ముంబయిలోని ఆడ శిశువు కథ
3) హైదరాబాద్లోని వేశ్యల కథ
4) కలకత్తాలోని పడుపు వృత్తి కథ
8. కోయతెగల వారు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు?
1) నిజామాబాద్ 2) నల్లగొండ
3) ఖమ్మం
4) మహబూబ్నగర్
9. 1969 తెలంగాణ ఉద్యమ కాలంలో మొట్టమొదటి సారిగా మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడి పేరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) టి. అంజయ్య
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) జె.బి. నరసింగరావు
10. బాల సంతులు ఒక?
1) నృత్యరూపం
2) కుల సమూహం
3) తెలంగాణ బాల కళాకారులు
4) ఆదిలాబాద్లో ఒక నది
11. వీర తెలంగాణ సినిమా దర్శకుడు ఎవరు?
1) దాసరి నారాయణరావు
2) ఆర్.నారాయణ మూర్తి
3) బి. నర్సింగరావు
4) మృణాల్ సేన్
12. తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేనిది ఎవరు?
1) స్వామి రామానంద తీర్థ
2) కొండా వెంకట రంగారెడ్డి
3) పి.వి.నరసింహారావు
4) మర్రి చెన్నారెడ్డి
13. నిజాం రాజ్యం అధికార రేడియో ఏది?
1) దక్కన్ రేడియో
2) అఖిల హైదరాబాద్ రేడియో
3) నిజాం రేడియో
4) గోల్కొండ రేడియో
14. రామప్ప దేవాలయానికి ఎవరి పేరు పెట్టారు?
1) రామ ప్రతాపరుద్ర అనే పాలకుని పేరు
2) రామప్ప పంతులు అనే పూజారి పేరు
3) రామప్ప అనే శిల్పి పేరు
4) శ్రీరామ ప్రభువు