సప్తవర్ష సంగ్రామం.. పారిస్ సంధితో పరిష్కారం
బెంగాల్ నవాబుగా పరిపాలించిన అలీ వర్ధిఖాన్ 1756లో మరణించారు. కొడుకులు లేనందువల్ల మూడో కుమార్తె కొడుకైన మీర్జా మహ్మద్‌ను అలీవర్ధిఖాన్ మరణానికి ముందే తన వారసుడిగా ప్రకటించాడు. ఇతడే చరిత్ర పుటల్లో సిరాజ్-ఉద్-దౌలా అనే పేరుతో ప్రసిద్ధి కెక్కాడు.
గ్రూప్స్ ప్రత్యేకం చరిత్ర
బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన
- బెంగాల్ నవాబుగా పరిపాలించిన అలీ వర్ధిఖాన్ 1756లో మరణించారు. కొడుకులు లేనందువల్ల మూడో కుమార్తె కొడుకైన మీర్జా మహ్మద్‌ను అలీవర్ధిఖాన్ మరణానికి ముందే తన వారసుడిగా ప్రకటించాడు. ఇతడే చరిత్ర పుటల్లో సిరాజ్-ఉద్-దౌలా అనే పేరుతో ప్రసిద్ధి కెక్కాడు.
- బెంగాల్ నవాబ్ పదవి చేపట్టేనాటికి సిరాజ్ 23 సంవత్సరాల యువకుడు. స్వేచ్ఛా పిపాసి. ఆంగ్లేయుల కార్యకలాపాలను అదుపు చేయాలనే కోరికతో అనేక చర్యలు తీసుకున్నాడు.
- సిరాజ్‌కు బద్ధశత్రువులైన అమీన్‌చంద్ అనే వర్తకునికి ఆంగ్లేయులు బెంగాల్లో ఆశ్రయం ఇచ్చారు. ఇదేవిధంగా సిరాజ్‌ను దెబ్బతీయడానికి ఢాకా రాణి అయిన గస్తీ బేగం సలహాదారుని కుమారుడు అయిన కృష్ణదాస్‌కు కలకత్తాలో ఆశ్రయం ఇచ్చారు.
- ఆంగ్లేయుల ఈ చర్యలు సిరాజ్-ఉద్-దౌలాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. బెంగాల్లో ఆంగ్లేయుల స్థావరాలైన కాశింబజార్, కలకత్తా ఆక్రమించాడు. పుల్టా ప్రాంతంలో ఉన్న ఆంగ్లేయులు మినహా అన్నిచోట్ల సిరాజ్ సైన్యాలు విజయం సాధించాయి.
- కలకత్తా ముట్టడిలో బంధీలుగా చిక్కిన 146 మంది బ్రిటిష్ వారిని (ఒక మహిళతో సహా) సిరాజ్-ఉద్-దౌలా విలియం కోటలోని ఒక చిన్న ఇరుకు గది (18X14X10 అడుగుల)లో బంధించాడని, ఊపిరాడక 123 మంది ఆంగ్లేయ బంధీలు మరణించారని, హల్వెల్ (ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకడు) అనే చరిత్రకారుడు రాశాడు. ఇది 1756, జూన్ 20న జరిగింది. దీన్ని చరిత్రలో చీకటి గది ఉదంతంగా (బ్లాక్ హౌస్ ట్రాజడీ) లేదా కలకత్తా చీకటి గది ఉదంతంగా చెప్తారు.
- ఈ పరిస్థితుల్లో బెంగాల్ వ్యవహారాలను నిర్వహించడానికి పంపిన బ్రిటిష్ సేనానులు రాబర్ట్ ైక్లెవ్, అడ్మిరల్ వాట్సన్‌లు కాశిం బజార్, కలకత్తాను పునరాక్రమించుకుని సిరాజ్‌తో 1757 జనవరిలో అలీనగర్ సంధి చేసుకున్నారు. కానీ సిరాజ్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతో సిరాజ్‌కు వ్యతిరేకంగా కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
సిరాజ్ వ్యతిరేక కూటమిలోని సభ్యులు
- కలకత్తాలోని సిరాజ్ ప్రతినిధి -మాణిక్‌చంద్
- వర్తక ప్రముఖులు- అమీన్ చంద్, జగత్ సేథీలు
- ప్రముఖ భూస్వాములు- రాయ్దుర్లబ్, ఖాదిమ్‌ఖాన్
- సిరాజ్-ఉద్-దౌలా సేనాని – మీర్జాఫర్ (మీర్ భక్షి)
- రాబర్ట్ ైక్లెవ్కు మీర్జాఫర్తో రహస్య ఒప్పందం కుదుర్చిన వర్తక ప్రముఖుడు అమీన్ చంద్. ఈ రహస్య ఒప్పందంలో సిరాజ్‌కు వ్యతిరేకంగా ఆంగ్లేయులకు అనుకూలంగా మీర్జాఫర్ పని చేస్తే సిరాజ్ తర్వాత బెంగాల్ నవాబీదారి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది.
- బెంగాల్లో బ్రిటిష్ అధికార స్థాపనకు దారి తీసిన ప్లాసీ యుద్ధం 1757, జూన్ 23న సిరాజ్, ఆంగ్లేయుల మధ్య జరిగింది. సిరాజ్ ఓడించబడి మరణించాడు. ైక్లెవ్ విజయం సాధించాడు. ఒప్పందం ప్రకారం మీర్జాఫర్ బెంగాల్ నవాబు అయ్యాడు.
- ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబు అయిన మీర్జాఫర్ ఆంగ్లేయులకు 24 పరగణాలు ఇవ్వడం జరిగింది. ైక్లెవ్కు కొంత మొత్తాన్ని చెల్లించారు.ైక్లెవ్ను 1758లో మొదటి బెంగాల్ గవర్నర్‌గా నియమించారు.
- ప్లాసీ యుద్ధంతో బెంగాల్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగినట్లు అయింది.
- ైక్లెవ్ తర్వాత బెంగాల్ గవర్నర్‌గా వాన్ సిట్టార్ట్ (1760-65) నియమితుడయ్యాడు. ఈ బెంగాల్ నవాబు మీర్జాఫర్ను తొలగించి మీర్ ఖాసింను బెంగాల్ నవాబుగా నియమించాడు. అందుకు ప్రతిఫలంగా ఆంగ్లేయులకు మీర్ ఖాసిం బర్వాన్, మిద్నాపూర్, చిట్టగాంగ్ ప్రాంతాలను ఇచ్చాడు.
- వాన్ సిట్టార్ మళ్లీ మీర్ ఖాసింను తొలగించి మీర్జాఫర్ను బెంగాల్ నవాబుగా నియమించాడు. ఈ పరిస్థితుల్లో మీర్ ఖాసిం అయోధ్య నవాబు ఘజా ఉద్దౌలా, మొగల్ చక్రవర్తి రెండో షా ఆలంతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆంగ్లేయులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు.
- బెంగాల్, అయోధ్య, మొఘల్ మిత్ర సైన్యాలు 1764, అక్టోబర్ 24న బ్రిటిష్ సేనల మధ్య సర్ హెక్టర్ మన్రో నాయకత్వంలో బక్సార్ వద్ద గొప్ప యుద్ధం జరిగింది. మిత్ర సైన్యాలు ఓడిపోయాయి. బక్సార్ యుద్ధ విజయంతో బ్రిటిష్ అధికారం సుస్థిరమైంది. మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా కొనసాగాడు.
- 1765 ఫిబ్రవరిలో మీర్ జాఫర్ మరణించగా బ్రిటిష్‌వారు అతని కుమారుడైన నాజిమ్ ఉద్దౌలాతో కొత్త ఒప్పందం కుదుర్చుకొని నవాబు సైన్యాన్ని రద్దు చేసి సైనిక అధికారాలన్ని బ్రిటిష్‌వారికి అప్పజెప్పాడు. బెంగాల్ ప్రభుత్వం పూర్తిగా బ్రిటిష్‌వారి ఆధీనంలోకి వచ్చింది.
- రాబర్ట్ ైక్లెవ్ 1765లో రెండోసారి బెంగాల్ గవర్నర్‌గా నియమితుడైన తర్వాత 2వ షా ఆలంతోనూ, ఘజా ఉద్దౌలాతో 1765లో అలహాబాద్ సంధి చేసుకున్నారు. బెంగాల్, బీహార్, ఒడిశాలలో రెవెన్యూ (దివానీ) అధికారం మొఘల్ చక్రవర్తి నుంచి పొందారు.
- అలహాబాద్ సంధి షరతులు
- దివానీ అధికారం కంపెనీకి, నిజామత్ అధికారం బెంగాల్ నవాబుకు ఇవ్వబడ్డాయి.
- ఉత్తర సర్కారుపై ఆంగ్లేయ అధికారాన్ని మొఘల్ చక్రవర్తి గుర్తించాడు.
- అలహాబాద్ కారా జిల్లాలను అయోధ్య నవాబు నుంచి తీసుకుని మొఘల్ చక్రవర్తికి ఇచ్చారు.
- బెంగాల్ నవాబుకు 50 లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చారు.
- బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. అంటే దివానీ పన్నులు వసూలు చేసుకొనే అధికారం.
- ఆంగ్లేయులకు, నిజామత్ పరిపాలనా బాధ్యతలు బెంగాల్ నవాబుకు ఇవ్వబడ్డాయి.
- తర్వాత ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వచ్చిన వారన్హేస్టింగ్ రద్దు చేశాడు.
బెంగాల్ గవర్నర్లు
1. రాబర్ట్ ైక్లెవ్ 1758-60
2. వాన్ సిట్టార్ట్ 1760-65
3. రాబర్ట్ ైక్లెవ్ 1765-67
4. వెరెల్ట్స్ 1767-69
5. కార్టియర్ 1769-72
6. వారన్‌హేస్టింగ్స్ 1772-74
బెంగాల్ నవాబులు
1. అలీవర్థిఖాన్ 1740-56
2. సిరాజ్ ఉద్దౌలా 1756-57
3. మీర్ జాఫర్ 1757-60
4. మీర్ ఖాసిం 1760-63
5. మీర్ అలీఖాన్ 1763-65
6. నజీబ్ ఉద్దౌలా 1765-66
కర్ణాటక యుద్ధాలు
- భారతదేశ చరిత్రలో ఆంగ్లో-ఫ్రెంచి కంపెనీల మధ్య స్థానిక పాలకులతో కలిసి చేసిన మూడు కర్ణాటక యుద్ధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతదేశ దూర దక్షిణ ప్రాంతాన్ని కర్ణాటక అని వ్యవహరించేవారు.
- కర్ణాటక ఆర్కాట్ కేంద్రంగా బీజాపూర్, గోల్కొండ పరిసర ప్రాంతం.
మొదటి కర్ణాటక యుద్ధం క్రీ.శ. 1744-1748
- క్రీ.శ. 1744 నుంచి 1748 వరకు భారతదేశంలో ఇంగ్లిష్, ఫ్రెంచి కంపెనీ సైన్యాల మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధానికి తక్షణ కారణం ఐరోపాలో ఆస్ట్రియా రాజైన చార్లెస్ అనంతరం ఆస్ట్రియా సింహాసనం విషయంలో తలెత్తిన వివాదం అని చెప్పాలి. దీన్నే ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంటారు.
- 1740లో ఐరోపాలో ఆస్ట్రియా, ప్రష్యాల మధ్య ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఆరంభమైంది. ఆగర్భ శత్రురాజ్యాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లు వరుసగా చెరో పక్షం వహించాయి. యుద్ధం ప్రతిధ్వనులు భారతదేశంలో వినిపించడంతో రెండు కంపెనీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.
- కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ సాయంతో ఆస్ట్రియా వారసత్వ యుద్ధ ఫలితంగా ఫ్రెంచివారు బ్రిటిష్‌వారి స్థావరమైన మద్రాసును ఆక్రమించుకున్నారు. అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే.
- ఈ విషయంపై బ్రిటిష్‌వారు అన్వరుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు. ఆగ్రహించిన అన్వరుద్దీన్ తన సేనలతో 1764లో ఫ్రెంచివారితో శాంథోమ్ యుద్ధంలో తలపడి పరాజితుడయ్యాడు. ఇది భారత, ఐరోపా సేనలు తొలిసారి ముఖాముఖి తలపడిన యుద్ధం.
- 1748లో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. ఎక్స్-లా-షాపెల్ సంధితో ముగిసింది. అందులోని యధాతథస్థితి, పునరుద్ధరణ అనే అంశం ఆధారంగా మద్రాసు తిరిగి బ్రిటిష్ వారికి ఇవ్వబడింది. దీంతో మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది.
రెండో కర్ణాటక యుద్ధం- 1749-1754
- రెండో కర్ణాటక యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధానికి కొనసాగింపు. ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి భారతదేశంలో ఆర్కాట్, హైదరాబాద్‌లో తలెత్తిన వారసత్వ తగాదాలు. రెండోది ఫ్రెంచి-ఆంగ్లో కంపెనీ అధికారుల మధ్య శత్రుత్వం.
- హైదరాబాద్, ఆర్కాట్ వారసత్వ తగాదాల్లో ఇరు కంపెనీల వారు వ్యతిరేక కూటముల్లో చేరారు. దీంతో తిరిగి యుద్ధం ప్రారంభమైంది.
- హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని పాలిస్తున్న దక్కన్ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ 1748లో మరణించడంతో హైదరాబాద్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఈ సింహాసనం కోసం నిజాం ఉల్ ముల్క్ కుమారుడు నాజర్‌జంగ్, మనమడు ముజఫర్ జంగ్ మధ్య యుద్ధం ప్రారంభమైంది.
- అదేవిధంగా కర్ణాటక నవాబు దోస్త్ అలీ మరణంతో అన్వరుద్దీన్‌కు చాందా సాహెబ్ ఆర్కాట్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది.
- ఫ్రెంచి గవర్నర్ డూప్లే హైదరాబాద్‌లో ముజఫర్ జంగ్‌ను, కర్ణాటకలో చాందా సాహెబ్‌ను సమర్థించి ఒక మిత్రకూటమిగా ఏర్పడి, డి-అతుల్ నాయకత్వంలో క్రీ.శ. 1749లో ఆర్కాట్ సమీపంలో ఉన్న అంబూర్ వద్ద జరిగిన యుద్ధంలో ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్‌ను ఫ్రెంచి సేనలు ఓడించి వధించాయి. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్అలీ ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లికి పారిపోయాడు.
- ఈ విజయంతో డూప్లే ముజఫర్ జంగ్‌ను దక్కన్ సుబేదారుగా, చాందాసాహెబ్ను కర్ణాటక నవాబుగా ప్రకటించారు.
- నాజర్ జంగ్ ‘లా-టీషే’ అనే ఫ్రెంచి సేనాని నేతృత్వంలో జరిగిన ఆకస్మిక దాడిలో చనిపోయాడు.
- ఇదే తరుణంలో ముజఫర్ జంగ్‌ను కడప, కర్నూలు నవాబులు రాయచోటి దగ్గర చంపేశారు. ఫ్రెంచివాడైన బుస్సీ ముజఫర్ సోదరుడైన సలాభత్ జంగ్‌ను హైదరాబాద్ సుబేదారుగా ప్రకటించాడు.
- 1752లో ఆంగ్లేయులు చాందా సాహెబ్‌ను వధించి, మహమ్మద్ అలీని కర్ణాటక నవాబుగా ప్రకటించారు. దీని కోసం రాబర్ట్ ైక్లెవ్ చేసిన యుద్ధమే ఆర్కాట్ యుద్ధం. 1751-52లో ైక్లెవ్ విజయం సాధించి ఆర్కాట్ వీరుడిగా శ్లాఘించబడ్డాడు.
యుద్ధ ఫలితాలు…
- హైదరాబాద్ నవాబు సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఉత్తర సర్కారులైన గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ జిల్లాలు ఇచ్చాడు. వీటిని నిలుపుకోవడం కోసం 1757లో బుస్సీ బొబ్బిలి యుద్ధం కూడా చేశాడు.
- ఆర్కాట్ నవాబుగా మహమ్మద్ అలీ ఆంగ్లేయుల సహకారంతో నియామకం.
- ఫ్రెంచి గవర్నర్ డూప్లే పదవీ విరమణ.
మూడో కర్ణాటక యుద్ధం – 1756-1763
- మూడో కర్ణాటక యుద్ధానికి కారణం ఐరోపాలో జరిగిన సప్తవర్ష సంగ్రామం. (ఏడు సంవత్సరాల యుద్ధం)
- డూప్లే తర్వాత ఫ్రెంచి గవర్నర్‌గా నియమితుడైన కౌంట్ డి లాలీ బ్రిటిష్ సేనాని సర్ ఐర్ కూట్ చేతిలో చరిత్రాత్మకమైన వందవాసీ యుద్ధంలో 1760లో ఓడిపోయాడు. ఈ యుద్ధం వల్ల లాలీ ఆదేశాల ప్రకారం హైదరాబాద్ నుంచి బుస్సీ వచ్చేయడంతో ఉత్తర సర్కారులను కూడా పోగొట్టుకున్నాడు.
- ఇదే సమయంలో విజయనగర చక్రవర్తి ఆనంద గజపతి సహకారంతో కల్నల్ ఫోర్డ్ అయిన బ్రిటిష్ సేనాని సలాబత్ జంగ్‌ను ఆధీనంలోకి తీసుకొని ఉత్తర సర్కార్లను పొందాడు.
- ఐరోపాలో జరిగిన సప్తవర్ష సంగ్రామం పారిస్ సంధితో ముగిసింది. అందువల్ల అంతకుముందు ఆంగ్లేయులు ఆక్రమించి పాండిచ్చేరిని మళ్లీ ఫ్రెంచివారికి ఇచ్చారు. కాని అప్పటికే ఫ్రెంచివారి ప్రాబల్యం పడిపోయింది.
ఫ్రెంచివారి పరాజయానికి కారణాలు
- ఫ్రెంచివారు రాజ్యస్థాపన మీద దృష్టి నిలిపి వర్తకాన్ని నిర్లక్ష్యం చేయడం
- ఫ్రెంచి సంస్థ ప్రభుత్వ సంస్థ కావడం, నిబంధనలు ఎక్కువగా ఉండటం
- కౌంట్ డి లాలీ రాజకీయ అవిజ్ఞత
- బ్రిటిష్ నౌకాబలంతో ఫ్రెంచి నౌకాబలం పోటీ పడలేకపోయింది. ైక్లెవ్ ఫోర్ట్, కూట్ లాంటి సమర్థవంతమైన సేనలు ఫ్రెంచి వారికి లేరు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

