Good news | ప్రవేశ పరీక్ష లేకుండానే ‘ఇగ్నో’లో ఎంబీఏ
‘ఇగ్నో’లో ఎంబీఏ | దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి శుభవార్త. ఇక నుంచి ప్రవేశపరీక్ష.. మార్కులతో నిమిత్తం లేకండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కల్పిస్తున్నది.

హైదరాబాద్ (నమస్తే తెలంగాణ ) : దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి శుభవార్త. ఇక నుంచి ప్రవేశపరీక్ష.. మార్కులతో నిమిత్తం లేకండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) కల్పిస్తున్నది.
గతంలో ఇగ్నో ఎంబీఏలో ప్రవేశాల కోసం ‘ఓపెన్ మ్యాట్’ ప్రవేశ పరీక్షను నిర్వహించేవారు. ఇప్పుడు ప్రవేశపరీక్షలో నిమిత్తం లేకుండా డిగ్రీ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నారు. ఏఐసీటీఈచే గుర్తింపు పొందిన ఈ కోర్సును కనిష్ఠంగా రెండేండ్లు, గరిష్ఠంగా నాలుగేండ్లల్లో పూర్తిచేయవచ్చు. జనరల్ విద్యార్థులు డిగ్రీలో కనీసంగా 50శాతం మార్కులు, రిజర్వ్డ్ కోటా 45 శాతం మార్కులు పొంది ఉండాలి.
విద్యార్థులు ఈ నెల 30లోగా ignouadmission.samarth.edu.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 94924 51812, 040 -23117550 నెంబర్లను సంప్రదించాలని ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్ ఫయాజ్ అహ్మద్ తెలిపారు.
హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం నుంచి ప్రతి ఏటా 200 -300 వరకు విద్యార్థులు అర్హత సాధించి, చేరుతుండగా, తాజాగా ప్రవేశపరీక్షతో నిమిత్తం లేకుండా ప్రవేశాలు కల్పిస్తుండటంతో వీరి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

