శాతవాహనుల పాలన – రాజకీయ పరిణామాలు
మత్స్య పురాణం 29 మంది శాతవాహన రాజులు క్రీ.పూ. 225 నుంచి క్రీ.శ.225 వరకు 450 సంవత్సరాలపాటు పరిపాలించారని చెపుతుంది.
మొదటి శాతకర్ణి బిరుదులు
ఏకవీర – శూరుడు
దక్షిణాపథపతి – అప్రతిహత చక్ర
మొదటి శాతకర్ణికి సమకాలీన రాజులు
ఉత్తర భారతదేశం- పుష్యమిత్రశుంగుడు
కళింగ – ఖారవేలుడు
ఇండోగ్రీకురాజు -డెమిట్రియస్
ఇండో గ్రీకురాజు – మీనాండర్
- మత్స్య పురాణం 29 మంది శాతవాహన రాజులు క్రీ.పూ. 225 నుంచి క్రీ.శ.225 వరకు 450 సంవత్సరాలపాటు పరిపాలించారని చెపుతుంది.
- శాతవాహనుల పాలన కాలాన్ని తొలి శాతవాహనులు, మలి శాతవాహనులుగా విభజించారు. శాతవాహన రాజ్య స్థాపన నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చే వరకు తొలి శాతవాహనులని, గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి చివరి వరకు మలి శాతవాహనులని అంటున్నారు.
శాతవాహనుల్లో ముఖ్య రాజులు
శ్రీముఖుడు : కృష్ణుడు
మొదటి శాతకర్ణి : రెండో శాతకర్ణి
కుంతల శాతకర్ణి : హాలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి : వశిష్టీపుత్ర శాతకర్ణి
వశిష్టీపుత్ర పులోమావి : యజ్ఞశ్రీ శాతకర్ణి
మూడో పులోమావి
శ్రీముఖుడు
- కణ్వవంశ రాజు సుశర్మను వధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.
- శాతవాహన రాజుల్లో ప్రముఖుడు, వంశకర్త/ వంశ మూలపురుషుడు శ్రీముఖుడే.
- శాతవాహన రాజ్య స్థాపనకు పునాదులు వేసిన స్వతంత్ర పాలకుడు. ఇతని నాణేలపై ఏనుగు, ఉజ్జయిని గుర్తులు కలవు. నాణేలలో ఇతని పేరు చిముఖగా పేర్కొన్నారు.
- మహారాష్ట్ర పాలకులైన మహారథికులతో వైవాహిక సంబంధాలను ఏర్పరచుకున్నాడు.
- మహారథి త్రనకైరో కుమార్తె నాగానికను తన కుమారుడైన మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు.
- జైన సారస్వతం ప్రకారం శ్రీముఖుడు మొదట జైన మతస్థుడు తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు.
- శ్రీముఖుడు 23 సంవత్సరాలపాటు రాజ్య పాలన చేశాడు.
- ఇతనికి ఉన్న ఇతరపేర్లు: చిముఖ, శిశుక, సింధుక, సిప్రక, సుద్ర, బలపుచ్చక, బలి
కృష్ణుడు
- ఇతను శ్రీముఖుడి తమ్ముడు. ఇతనికి ఉన్న మరోపేరు కన్హుడు.
- ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో భాగవత మతం ప్రవేశ పెట్టబడింది.
- కన్హుడు బౌద్ధ సన్యాసుల కోసం ధర్మ మహామాత్య అనే ఉద్యోగులను నియమించాడు.
మొదటి శాతకర్ణి
- మొదటిసారిగా తన పేరును శాతవాహన అనే వంశ నామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు. శ్రీముఖుడి కుమారుడు.
- దేవి నాగానిక వేయించిన నానాఘాట్ శాసనంలో పేర్కొన్న శాతకర్ణి ఇతనే అని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు.
- ఖారవేలుడు మొదటి శాతకర్ణి రాజ్యంలోని ముషిక నగరంపై దాడిచేసి ఆ నగరానికి పితుండ అని పేరు పెట్టాడని హతిగుంఫా శాసనం తెలియజేస్తుంది.
- వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాదులను నిర్వహించిన మొదటి శాతవాహనరాజు.
- మొదటి శాతకర్ణి శుంగరాజైన పుష్యమిత్ర శుంగుడుని ఓడించాడు.
- శాతకర్ణి రెండు అశ్వమేథయాగాలు, ఒక రాజసూయ యాగంతోపాటు 20 క్రతువులు నిర్వహించాడు.
- ఈ సందర్భంగా వేలకొద్ది కర్షపణాలు, ఆవులు, ఏనుగులు, గుర్రాలను దానం చేశాడు.
- ఇతను పుష్యమిత్రశుంగుడుపై సాధించిన విజయాలకు చిహ్నంగా ఉజ్జయిని పట్టణ గుర్తు గల నాణేలను ముద్రించాడు.
- ఏనుగు గుర్తుతో నాణేలను కూడా ముద్రించాడు.
- తొలిసారిగా బ్రాహ్మణులకు వెండి నాణేలతోపాటు భూములను కూడా దానం చేసి వాటికి పన్ను మినహాయింపు ఇచ్చాడు.
- ఇతని తర్వాత పుర్ణోత్సంగడు రాజ్యానికి వచ్చాడు.
రెండో శాతకర్ణి
- ఇతను 56 సంవత్సరాలపాటు రాజ్యపాలన చేశాడు.
- ఇతని కాలంలోనే శక- శాతవాహన సంఘర్షణలు ప్రారంభమయ్యాయి.
- సాంచి స్థూపంపై గల శాసనం ఇతడిదే అని కొందరి పండితులు భావిస్తారు.
- ఇతడు శకుల నుంచి మాళవను ఆక్రమించాడు.
- రెండో శాతకర్ణి తర్వాత వరసగా లంబోదరుడు, అపీలకుడు, మేఘస్వాతి, స్వాతి, స్కందస్వాతి, మృగేంద్రస్వాతికర్ణి, కుంతల శాతకర్ణి, స్వాతికర్ణి అనే ఎనిమిది మంది రాజులు పాలించారు
- వీరిలో అపీలకుడిదిగా భావిస్తున్న పెద్ద రాగి నాణేం చందా జిల్లాలో దొరికింది. ఇతడు 12 ఏండ్లు పాటు రాజ్యపాలన చేశాడు.
కుంతల శాతకర్ణి
- ఇతని కాలంలోనే ప్రాకృతభాష స్థానంలో సంస్కృతం రాజ భాషగా మారింది.
ఇతని ఆస్థానంలో పండితులు - వాత్సాయనుడు కామసూత్రాలు
- గుణాఢ్యుడు -బృహత్కథ
- శర్వవర్మ -కాతంత్ర వ్యాకరణం
- వాత్సాయనుడి కామసూత్ర గ్రంథంలో కుంతల శాతకర్ణి ప్రస్తవన ఉంది.
- ఇతడి నాణేలపై పాటలీపుత్ర చిహ్నన్ని ముంద్రించాడు..
హాలుడు
- శాతవాహన రాజుల్లో 17వ రాజు.
- ఇతడు సారస్వతాభిమాని. సాహితీవేత్త, స్వయంగా కవి వత్సలుడనే బిరుదు ఉంది.
- కేవలం ఒక సంవత్సరం మాత్రమే పరిపాలించాడు.
- బాణుడు హర్ష చరిత్రలో గాథాసప్తశతిని హర్షుడు రచించాడని పేర్కొన్నాడు.
- పాకృతభాషలో సామాజిక పరిస్థితులపై 700 శృంగార గాథలను గాథాసప్తశతిలో రచించాడు.
- సింహాళ రాకుమార్తె లీలావతిని వివాహం చేసుకున్నాడు. సప్తమ గోదావరి వద్ద భీమేశ్వర సన్నిధిలో ఈ వివాహం జరిగినట్లు కుతూహలుడు లీలావతి కావ్యంలో పేర్కొన్నాడు.
- వాత్సాయన కామసూత్రం, రాజశేఖరుడి కావ్యమీవాంస గ్రంథాలు హాలుడి గురించి ప్రస్తావించాయి.
- ఇతని కాలాన్ని పాకృతంలో స్వర్ణయుగంగా కీర్తించారు.
గౌతమీపుత్ర శాతకర్ణి
- శాతవాహన రాజుల్లో 23వ రాజు
- శాతవాహన చక్రవర్తుల్లో అగ్రగణ్యుడు. గొప్ప విజేత.
- ఏడీ 78లో శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు.
- మాతృసంజ్ఞను వాడిన మొదటి శాతవాహనరాజు.
- శాతవాహన రాజుల్లో పేరుకు ముందు తల్లి పేరును పెట్టుకునే సంప్రదాయం గౌతమీపుత్ర శాతకర్ణితోనే ప్రారంభమైంది.
- ఇతని తల్లి గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని అతని మరణానంతరం వేయించింది. ఈ శాసనంలో తన కుమారుడి దండయాత్రలను, విజయాలను వివరించింది.
- శాతవాహన రాజ్య పశ్చిమ సరిహద్దులను క్షహరాట వంశీయులు పాలించేవారు. క్షహరాట వంశీయుల్లో శకరాజు నహపాణుడు గొప్పరాజు.
- శక-శాతవాహనుల మధ్య సముద్ర వ్యాపారం కోసం నిరంతరం ఘర్షణలు జరుగుతుండేవి.
- క్షహరాట వంశీయుడైన శకరాజు నహపాణుడికి గౌతమీపుత్ర శాతకర్ణికి మధ్య మహారాష్ట్రలోని జోగల్తంబి వద్ద యుద్ధం జరిగింది. దీన్నే జోగల్తంబీ యుద్ధం/ గోవర్థనహార యుద్ధం అంటారు.
- యుద్ధంలో క్షహరాట వంశాన్ని పూర్తిగా అంతం చేసి నహపాణుడిని హతమార్చి క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదును పొందాడు.
- గౌతమీ పుత్రశాతకర్ణి శకులను, యవనులను, పల్లవులను ఓడించాడు. క్షాత్రప వంశాన్ని నిర్మూలించాడు. శాతకర్ణి అనుప, అపరాంత, సౌరాష్ట్ర, కుకుర, అవంతి రాజ్యాలను జయించాడు.
- జోగల్ తంబి వద్ద శాతకర్ణి పునర్ ముద్రించిన నాణేలు ఒక రాశిగా (9,270 నాణేలు) దొరికాయి.
l గౌతమీ పుత్ర శాతకర్ణి నాసిక్గుహల్లో రెండు శాసనాలను వేయించాడు. ఒకటి 18వ పాలనా సంవత్సరానికి చెందినది. రెండోది 24వ పాలనా సంవత్సరాలని చెందినది. ఇతడి నాణేలు కొండాపూర్, పెదబంకూర్ వద్ద వందల కొద్ది దొరికాయి. - ఇతని కాలం నాటి టంకశాల నాగార్జున కొండ వద్ద లభించింది.
- గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు
ఏకబ్రాహ్మణ -ఏక ధనుర్ధరుడు
ఏకశూరుడు- ఆగమనిలయుడు
త్రిసముద్రలోయ పీతావాహన
బేనకటక స్వామి -శకసంహారి
వర్ణసాంకర్య నిరోధక - మొదటి దక్షిణ దేశ రాజుగా ఖ్యాతి గడించాడు.
- పరమత సహనం పాటించి బౌద్ధ మతాన్ని కూడా ఆదరించి, బౌద్ద బిక్షువులకు భూదానాలు చేయడంతోపాటు భద్రనేయ బౌద్దశాఖ బిక్షువులకు నాసిక్‌లో గుహాలయాలను తొలిపించి ఇచ్చాడు.
వాశిష్టీపుత్ర పులోమావి
- ఇతడు గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు. ఇతడికి రెండో పులోమావి అనే పేరు ఉంది. ఇతని కాలంలోనే బాలశ్రీ నాసిక్ శాసనాన్ని జారీ చేసింది.
- నాసిక్ శాసనంలో దక్షిణ పథేశ్వరుడుగా కీర్తించబడ్డాడు.
- రాజధానిని అమరావతికి మార్చాడు.
- ఇతని కాలంలోనే అమరావతి స్థూప నిర్మాణం జరిగింది.
- ఇతడి బిరుదు నవనగర స్వామి.
- ఇతడి శాసనాలు నాసిక్, కార్లే, అమరావతి, మ్యాకదోని, బనవాసి మొదలైన చోట్ల ఉన్నాయి.
వాశిష్టి పుత్ర శాతకర్ణి
- క్షాత్రప రుద్రదాముడు దక్షిణాపథప్రభువు శాతకర్ణిని రెండు పర్యాయాలు ఓడించినట్లు జునాగఢ్ శాసనంలో పేర్కొన్నాడు. ఈ ప్రస్తావన వాశిష్టీ పుత్ర శాతకర్ణికి సంబంధించినదై ఉంటుంది.
- ఇతడి పేరుతో ఉన్న వెండినాణేలు, సీసం నాణేలు గోదావరి, కృష్ణ ప్రాంతాల్లో దొరికాయి.
- ఇతడి రాణి చెక్కించిన కన్హేరి శాసనంలో అతని ప్రస్తావన ఉంది. ఆమె మహాక్షాత్రప (రుద్రదామన్) కుమార్తెగా చెప్పుకుంది.
యజ్ఞశ్రీ శాతకర్ణి
- శాతవాహన రాజుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి చివరి గొప్పవాడు. ఇతడు పురాణాల్లో 26వ రాజు.
- ఇతడి శాసనాలు కన్హేరిలో రెండు, నాసిక్‌లో, చినగంజాం (కృష్ణ జిల్లా) వద్ద కూడా లభించాయి.
- శాతవాహన రాజులందరికంటే ఎక్కువ సంఖ్యలో నాణేలను ముద్రించాడు. ఇతడు తెరచాప, ఓడ గుర్తు గల నాణేలను ముద్రించాడు.
- విదేశీ వాణిజ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఇతని కాలంలో రోమ్ దేశంతో వర్తకం విరివిగా జరిగేది.
- యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి సమకాలీనుడు.
- ఇతడు బౌద్ధమతాభిమాని. తన పరిపాలనాకాల చివరి దశలో నాగార్జునుడి ప్రభావం వల్ల మహాయాన బౌద్ధంను స్వీకరించినట్లు తెలుస్తుంది.
- ఇతను ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండ వద్ద 1500 గదులతో కూడిన పారావత విహారాన్ని నిర్మించాడు.
- అమరావతి స్థూపాన్ని విస్తరించాడు. ఇతని కాలంలోనే మత్స్య పురాణ సంకలనం ప్రారంభమైంది.
- ఇతని కాలంలోనే బౌద్ధమత గ్రంథాలు అధికంగా అనువాదం జరిగాయి.
- హర్షవర్దుని ఆస్థాన కవి బాణభట్టు యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతిగా పేర్కొన్నాడు.
- కథాసరిత్సాగరం ప్రకారం నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్య చేయబడ్డాడని అనంతరం రాజ్యం అల్లకల్లోలమైందని సూచిస్తుంది.
- యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదాముని చేతిలో ఓడిపోయి పశ్చిమ ప్రాంతాన్ని కోల్పోయాడు.
- యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత ముగ్గురు శాతవాహన రాజులు 17 సంవత్సరాలు పాలించారు. వారు విజయ శాతకర్ణి, చందశ్రీ,
మూడో పులోమావి.
మూడో పులోమావి
- శాతవాహన రాజుల్లో చివరి వాడు
- ఇతనితో శాతవాహన సామ్రాజ్యం అంతమైంది.
- ఇతని రాజధాని బళ్లారి. ఇతను జారీ చేసిన మ్యాకదోని శాసనం శాతవాహనుల పతనం గురించిన వివరాలు అందిస్తుంది.
- ఇతని మరణానంతరం శాతవాహనుల రాజ్యం అంతం అయి వీరి సామంతులైన అభీరులు, చుటు వంశీయులు, ఇక్షాకులు, పల్లవులు విజృభించి స్వతంత్రులై, సొంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

