లా నినా
1. కింది వాటిని జతపరచండి.
రాష్ట్రం వర్షపాతం వివిధ పేర్లు
1. ఉత్తరప్రదేశ్ ఎ. అంధీలు
2. పశ్చిమ బెంగాల్ బి. కాలాభైశాఖీలు
3. అసోం సి. నార్వెస్టర్స్
4. కర్ణాటక డి. చెర్రీ బ్లాసమ్స్
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
2. భారతదేశ శీతోష్ణస్థితిని మౌలికంగా ఎలా చెప్పవచ్చు?
1) అయన రేఖా శీతోష్ణస్థితి
2) ఉప అయన ఉష్ణమండల శీతోష్ణస్థితి
3) ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి
4) సమశీతల శీతోష్ణస్థితి
3. నైరుతి రుతు పవనాలు మొట్టమొదట ప్రవేశించే ప్రాంతం?
1) మలబార్ తీరం 2) కొంకన్ తీరం
3) కోరమండల్ తీరం 4) సర్కార్ తీరం
4. నైరుతి రుతుపవనాల సమయంలో వర్షం పొందని ప్రాంతం ఏది?
1) జైపూర్ 2) తంజావూర్
3) జబల్పూర్ 4) కొచ్చిన్
5. భారతదేశంలో రుతుపవనాలు రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటి?
1) ఉత్తర భారతదేశం, దక్షిణ
భారతదేశం మధ్య ఉష్ణోగ్రతా వైవిధ్యం
2) భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నందువల్ల
3) భారతదేశం, హిందూ మహాసముద్రం మధ్య ఉష్ణోగ్రతా వైవిధ్యం
4) వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతల మధ్య భేదం
6. కింది వాటిని జతపరచండి.
ఎ. అజ్మీర్ 1. 100-200
సెం.మీ వర్షపాతం
బి. భోపాల్ 2. 200 సెం.మీ
కంటే ఎక్కువ
వర్షపాతం
సి. మంగుళూరు 3. 50-100 సెం.మీ
వర్షపాతం
డి. బుర్ద్వాన్ 4. 50 సెం.మీ కంటే తక్కువ వర్షపాతం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
7. శీతాకాలంలో భారతదేశంలో వచ్చే వర్షాలకు కారణం?
1) చక్రవాతాలు
2) పశ్చిమ విక్షోభాలు
3) సంవహనాలు
4) కుంభవృష్టి వర్షాలు
8. భారతదేశంలో పశ్చిమ అలజడుల వల్ల ఎక్కువగా వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
1) సట్లెజ్- యమునా మైదానం
2) చంబల్ -యమునా మైదానం
3) పశ్చిమ రాజస్థాన్ 4) కశ్మీర్ లోయ
9. ‘అక్టోబర్ హీట్’కు కారణం ఏమిటి?
1) బెంగాల్ మైదాన ప్రాంతంలో
అక్టోబర్లో వాతావరణంలో ఆర్ధ్రత
పరిమాణం అధికంగా ఉండటం
2) పొడి, వేడి వాతావరణం
3) పవనాల వేగం తక్కువగా ఉండటం
4) గంగా మైదానంలో ఏర్పడే అల్పపీడన ద్రోణి
10. మేఘాలయాలో అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్రామ్ ఏ కొండల్లో ఉంది?
1) నాగా కొండలు 2) మిష్మీ కొండలు
3) ఖాసీ కొండలు 4) సాత్పురా కొండలు
11. దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది?
1) 3 2) 4 3) 5 4) 6
12. భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఎప్పుడు వస్తుంది?
1) మార్చి – జూన్ మధ్య
2) జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు
3) అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు
4) మే నుంచి అక్టోబర్ వరకు
13. వేసవికాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు?
1) తగ్గుతాయి 2) పెరుగుతాయి
3) మార్పు ఉండదు
4) పెరిగి, తగ్గుతాయి