ఈసీఐఎల్‌లో 212 గ్రాడ్యుయేట్ / డిప్లొమా అప్రెంటిస్‌లు
ECIL | హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 212 పోస్టులను భర్తీ చేస్తున్నది. అకడమిక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఎంపికైనవారు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో అప్రెంటిస్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం అప్రెంటిస్‌లు: 212
ఇందులో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ (GEA) 150, డిప్లొమా 62 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: 2020, ఏప్రిల్ 1 నాటికి నాలుగేండ్ల బీఈ, బీటెక్, మూడేండ్ల డిప్లొమా పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: 2022, డిసెంబర్ 26
ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్: 2022, డిసెంబర్ 28
జాయినింగ్: 2022, డిసెంబర్ 31
అప్రెంటిస్‌షిప్ ప్రారంభం: 2023, జనవరి 2
వెబ్సైట్: www.careers.ecil.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Apprentice
- Diploma
- ECIL
- Graduate
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

