న్యూఢిల్లీ: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) జేఆర్ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు ఈనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎనిమిది పోస్టులను భర్తీ చేస్తున్నది. టర్మినల్ బాలిస్టిక్ రిసెర్చ్ లాబొరేటరీలో ఈ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 8
ఇందులో జేఆర్ఎఫ్ 7 (కెమిస్ట్రీ 4, ఫిజిక్స్ 2, మెకానికల్ ఇంజినీరింగ్ 1), రిసెర్చ్ అసోసియేట్ (కెమిస్ట్రీ) 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కెమిస్ట్రీలో పీహెచ్డీ, పీజీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్: www.drdo.gov.in