Osmania University | ఇకపై డాక్టర్లు, ఇంజినీర్లూ ఎమ్మెస్సీ చేయొచ్చు.. ఓయూలో కొత్త ప్రయోగం
ఉన్నత విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్, ఎంబీబీఎస్, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, లైఫ్‌సైన్సెస్ వంటి కోర్సుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్, ఎంబీబీఎస్, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, లైఫ్‌సైన్సెస్ వంటి కోర్సుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు. తొలుత ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విధానం ప్రవేశపెట్టి, భవిష్యత్తులో ఇతర యూనివర్సిటీలకు విస్తరించనున్నారు. త్వరలో విడుదల చేయనున్న కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2023 నోటిఫికేషన్ ద్వారా ఈ అవకాశం కల్పించనున్నారు.
గతంలో బీటెక్ పూర్తిచేసిన వారికి ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం వంటి కోర్సుల్లో మాత్రమే ప్రవేశం లభించేది. ఇక నుంచి వీరు ఎమ్మెస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనూ చేరవచ్చు.
ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు ఆసక్తి ఉంటే ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్ వంటి పీజీ కోర్సుల్లో చేరవచ్చు.
ఆర్ట్స్ ప్రయోగం విజయవంతం
డిగ్రీ సబ్జెక్టులతో నిమిత్తం లేకుండా పీజీ ఆర్ట్స్ కో ర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశాన్ని ఈ విద్యా సం వత్సరం నుంచే కల్పించారు. రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో ఈ తరహా ప్రవేశాలకు అవకాశం కల్పించగా అది సత్ఫలితాలనిచ్చింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినవారికైనా ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించారు. గతంలో ఎంఏ ఆర్కియాలజీ, సోషియాలజీ, ఇస్లామిక్ స్టడీస్, జర్నలిజం, బీఎల్ఐసీ వంటి కోర్సులకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

