23న DEECET-22.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
DEECET | ప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే డీఈఈసెట్-22 పరీక్ష తేదీని విద్యాశాఖ ప్రకటించింది. డీఈఈ సెట్‌ను ఈ నెల 23న
హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే డీఈఈసెట్-22 పరీక్ష తేదీని విద్యాశాఖ ప్రకటించింది. డీఈఈ సెట్‌ను ఈ నెల 23న నిర్వహిస్తామని డైట్‌సెట్ కన్వీనర్ వెల్లడించారు. ప్రవేశ పరీక్ష రెండు సెషన్లలో ఉంటుందని చెప్పారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తెలుగు మీడియం విద్యార్థులకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంగ్లిష్, ఉర్దూ మీడియం అభ్యర్థులకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అందువల్ల విద్యార్థులు పరీక్ష సయానికి గంటన్నర ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు.
ఈ ఏడాది డీఈఈసెట్ కోసం మొత్తం 11,680 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇందులో తెలుగు మీడియం అభ్యర్థులు 4967 మంది, ఇంగ్లిష్ మీడియం 5348 మంది, ఉర్దూ మీడియం 1365 మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. అడ్మిట్ కార్డులు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అభ్యర్థులు deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

