CBSC Exams | ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్సీ బోర్డ్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి.
న్యూఢిల్లీ: సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Cards) ఈ వారంలో విడుదల కానున్నాయి. అధికారిక వెబ్సైట్ cbsc.gov.inలో అందుబాటులో ఉంచనున్నారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ప్రైవేటుగా పరీక్ష రాస్తున్న వారి అడ్మిట్ కార్డులను ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వడంతోపాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌ను రూపొందించారు. సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి, ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్ పేపర్‌ను ఫిబ్రవరి 28కి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్, ఫిబ్రవరి 23న టిబెటన్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేవలం ఫ్యాషన్ స్టడీస్ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21కి మార్చారు. పదోతరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

