ఫిజిక్స్ సిలబస్ పెంపు.. క్యూఆర్ కోడ్‌తో బుక్స్ : ఇంటర్‌బోర్డు
ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌ను ఇంటర్‌బోర్డు మార్చింది. ఫిజిక్స్ సిలబస్‌ను కాస్త పెంచింది. కొన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌ను స్వల్పంగా తగ్గించింది. పాఠ్యపుస్తకాల్లో కవర్ పేజీలో మార్పులు చేశామని, మల్టీకలర్‌తో ముద్రించినట్టు ఇంటర్‌బోర్డు తెలిపింది.
- కొన్ని సబ్జెక్టుల్లో స్వల్పంగా తగ్గింపు..
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్‌ను ఇంటర్‌బోర్డు మార్చింది. ఫిజిక్స్ సిలబస్‌ను కాస్త పెంచింది. కొన్ని సబ్జెక్టుల్లో సిలబస్‌ను స్వల్పంగా తగ్గించింది. పాఠ్యపుస్తకాల్లో కవర్ పేజీలో మార్పులు చేశామని, మల్టీకలర్‌తో ముద్రించినట్టు ఇంటర్‌బోర్డు తెలిపింది. ఈసారి క్యూఆర్ కోడ్‌తో పుస్తకాలు ముద్రించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. పాఠ్యాంశాల కూర్పులో వర్తమాన అవసరాలు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసినట్టు పేర్కొన్నారు. కమ్యూనికేటివ్ సిల్స్ అభివృద్ధి చేసేలా సిలబస్ రూపొందించినట్టు వెల్లడించారు.
తెలుగు పాఠ్యపుస్తకంలో తెలంగాణ కల్చర్, స్థానిక సంప్రదాయాలతో పాఠ్యాంశాలుంటాయి. స్థానిక కళలు, ముఖ్యమైన తెలుగు పరిచయం ఇందులో ఉంటుంది. ‘మీకు తెలుసా?’ అనే బాక్స్‌తో విద్యార్థి సృజనకు పెద్దపీట వేశారు.
గణితం పేపర్-1ఏలో కొత్తగా సెట్స్ అండ్ రిలేషన్స్, సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అధ్యాయాలు చేర్చారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్తలను పరిచయం చేసే ప్రయ త్నం చేశారు. గతంలో ఉన్న పేజీలను కుదించారు. పునరావృతమవుతున్న సమస్యలను తగ్గించారు.
ఫిజిక్స్‌లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్-ఫిజిక్స్ అధ్యాయాన్ని ప్రవేశపెట్టారు. ఏఐతోపాటు రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్‌సైన్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీని అంతర్భాగం చేశారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

