JEE Main | ఏప్రిల్ 1న జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు!
జేఈఈ మెయిన్ (JEE Main) రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Card) మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ (JEE Main) రెండో సెషన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Card) మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 1న అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 15 వరకు రోజూ రెండు సెషన్లలో దేశవ్యాప్తంగా 319 పట్టణాల్లో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. భారత్ అవతల 22 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-1 (బీఈ లేదా బీటెక్) పరీక్షను, పేపర్-2 ఏ (బీఆర్క్), పేపర్-2బీ (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహిస్తారు. అదే నెల 25న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్ సెషన్-1 గత జనవరిలో ముగిసిన విషయం తెలిసిందే. మొదటి విడుతలో 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ మార్కులు సాధించారు. వారిలో అత్యధికంగా తెలంగాణ నుంచి ఏడుగురు ఉన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు చొప్పున 100 పర్సంటైల్ స్కోర్ చేశారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- admit card
- BArch
- BE
- BPlanning
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

