బుల్లితెరపై కూడా దుమ్ము రేపిన జాంబీ రెడ్డి

తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ కామెడీను అందించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి నందినీ, ఢిల్లీ బ్యూటీ దక్షనగర్కర్ హీరోయిన్స్గా నటించారు. గెటప్ శీను, హేమంత్, అన్నపూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించారు.
జాంబీ జోనర్లో వచ్చిన తొలి తెలుగు సినిమా జాంబీ రెడ్డి కాగా, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం అయింది. దీనికి ఏకంగా 9.7 టీర్పీ వచ్చింది. కొత్త హీరోకు ఈ రేంజ్ టీ ఆర్పీ రావడాన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. త్వరలో జాంబీ రెడ్డి సినిమాకు సీక్వెల్ ఉంటుందని వార్తలు వస్తుండగా, ఇందులో సమంత నటిస్తుందనే ప్రచారం కూడా నడుస్తుంది. జాంబీ రెడ్డి చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తొలి సినిమాగా అ! అనే సినిమా చేయగా, ఈ చిత్రంతో జాతీయ అవార్డ్ కూడా పొందాడు. అనంతరం రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా చేశాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- teja sajja
- trp
- zombie reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

