Indian Railway | రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. మీ ఫోన్లకు చార్జింగ్ పెట్టలేరిక!
ప్రయాణికుల భద్రతదృష్ట్యా భారత రైల్వే ( Indian railway ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో చార్జింగ్ ( cell phone charging ) పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు.

న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతదృష్ట్యా భారత రైల్వే ( Indian railway ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రయాణికులు రాత్రివేళల్లో రైలు కోచ్‌లలో చార్జింగ్ ( cell phone charging ) పాయింట్లను ఇకపై ఉపయోగించలేరు. అగ్ని ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాత్రి సమయంలో ఛార్జింగ్ పాయింట్ల వాడకంపై రైల్వే శాఖ నిషేధం విధించింది. ఇటీవల ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక కోచ్‌లో మొదలైన మంటలు ఏడు బోగీలకు వ్యాపించాయి.
‘ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రైళ్లలో చార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వే నిర్ణయించింది’ అని వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు.
ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు రాత్రిపూట చార్జింగ్ పెట్టే క్రమంలో కొన్నిసార్లు అవి వేడెక్కడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మంటలు సంభవిస్తున్నాయి. దీంతో ఇతర రైల్వే జోన్లలో కూడా ఈ నిబంధనలను అమలు చేయనున్నట్లు ఠాకూర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మరింత తీవ్రంగా కరోనా.. మాస్కులు ఉండాల్సిందే
మాస్క్ సరిగా పెట్టుకోకుంటే.. విమానాశ్రయాల్లో భారీ జరిమానా
ఆ పోలీస్ స్టేషన్లో గంగా జలమే శానిటైజర్
వకీల్ సాబ్: పవన్ కళ్యాణ్ దెబ్బకు రికార్డులు షేక్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

