New Year Eve | ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్‌లో కూడా 2023 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇక్కడ 4 గంటల పాటు కర్ఫ్యూ ఎత్తివేశారు. కాగా, రష్యన్ వ్యోమగాములు అంతరిక్షంలోని జీరో గ్రావిటీలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ముగ్గురు రష్యన్ వ్యోమగాములు సెర్గీ ప్రోకోపీవ్, అన్నా కికినా, డిమిత్రి పెటెలిన్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ఫొటోలను పంపారు. అంతకుముందు వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని అందంగా అలంకరించారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ స్కై టవర్ మెరిసే లైట్లతో ముస్తాబై అలరించింది.
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన కొన్ని ఫొటోలు మీ కోసం..