మా జుట్టు.. మా ఇష్టం
ఆకతాయి వాలుజడ లాగి శునకానందం పొందుతాడు. మొగుడు కొప్పు పట్టుకుని వీరంగం చేస్తాడు. చేయని తప్పులకు శిక్షిస్తూ కులపెద్దలు కేశముండనం చేయాలంటూ తీర్పు ఇస్తారు. వైధవ్యం ప్రాప్తించగానే అంతా కలిసి గుండు గీకేస్తారు.
ఆకతాయి వాలుజడ లాగి శునకానందం పొందుతాడు. మొగుడు కొప్పు పట్టుకుని వీరంగం చేస్తాడు. చేయని తప్పులకు శిక్షిస్తూ కులపెద్దలు కేశముండనం చేయాలంటూ తీర్పు ఇస్తారు. వైధవ్యం ప్రాప్తించగానే అంతా కలిసి గుండు గీకేస్తారు. మహాభారతంలో దుశ్శాసనుడి దురహంకార ఘట్టం ఉండనే ఉంది? కవులు కారుమేఘాలతోనో, తుమ్మెదల సమూహంతోనో పోల్చి మురిసిపోయే ఒత్తయిన జుట్టును ఆధునిక మహిళ అణచి వేతకు ప్రతీకగా భావిస్తున్నది.
‘హెయిర్ అండ్ హర్’ పేరుతో స్వాతి భట్టాచార్య అనే ఫొటోగ్రాఫర్ చేపట్టిన వినూత్నమైన ప్రాజెక్ట్ ఇతివృత్తమూ ఇదే. ఫొటో ఎగ్జిబిషన్ జరిగిన ప్రతిచోటా.. ఒక డొనేషన్ బాక్స్ పెడతారామె. మహిళా ప్రపంచానికి మద్దతుగా ఎవరికివారు.. కొన్ని వెంట్రుకలు అందులో వేయాలని కోరతారు. ‘అందాన్ని, కేశ సౌందర్యాన్ని ఇప్పటిదాకా పురుషుల కోణంలో చూసింది చాలు. ఆమె నెత్తిన మోపిన ఆంక్షలు చాలు. తన ఆకాంక్షల ప్రకారం ఆమె బతికే అవకాశం ఇవ్వండి’ అంటారు స్వాతి భట్టాచార్య. ‘జడ వేసుకోవడం, కొప్పులో పూలు తురుముకోవడం, పిరుదులదాకా కేశాలు పెంచుకోవడం.. ఇవన్నీ స్త్రీ తనకు తాను ఇచ్చుకున్న సౌందర్య నిర్వచనాలు కాదు. మగపెత్తనం అంటగట్టిన పైత్యాలే’ అంటారామె. జుట్టు ఇతివృత్తంగా తాను తీసిన ఫొటోలను ఈ మధ్యే ముంబైలో ప్రదర్శించారు స్వాతి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Activist
- hair
- Hair and Her
- Movement
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

