ప్రేమలో పడ్డానేమో?
నా సమస్య గురించి చెప్పాలంటే.. సంక్షిప్తంగా అయినా నా కథ వివరించాలి. నేను కార్పొరేట్ ఉద్యోగిని. పని ఒత్తిడి బాగానే ఉంటుంది. దీంతో తరచూ మెట్రో ట్రైన్లో కునుకుతీస్తుంటాను. ఒకసారైతే, మొద్దు నిద్రలో జారిపోయాను. హఠాత్తుగా భుజం తట్టినట్టు అనిపించింది. దిగ్గున మేల్కొన్నాను. ఎవరో అపరిచితుడు. ‘మేడమ్ మీ స్టేషన్..’ అంటూ తట్టిలేపాడు. సిగ్గుగా అనిపించింది. పరుగుపరుగున వెళ్లి బండి దిగాను. అతనికి థ్యాంక్స్ చెబితే బావుండేదేమో అనిపించింది కూడా. అంతలోనే నేను మెట్రోలో ఓ ఫైల్ మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది
నా సమస్య గురించి చెప్పాలంటే.. సంక్షిప్తంగా అయినా నా కథ వివరించాలి. నేను కార్పొరేట్ ఉద్యోగిని. పని ఒత్తిడి బాగానే ఉంటుంది. దీంతో తరచూ మెట్రో ట్రైన్లో కునుకుతీస్తుంటాను. ఒకసారైతే, మొద్దు నిద్రలో జారిపోయాను. హఠాత్తుగా భుజం తట్టినట్టు అనిపించింది. దిగ్గున మేల్కొన్నాను. ఎవరో అపరిచితుడు. ‘మేడమ్ మీ స్టేషన్..’ అంటూ తట్టిలేపాడు. సిగ్గుగా అనిపించింది. పరుగుపరుగున వెళ్లి బండి దిగాను. అతనికి థ్యాంక్స్ చెబితే బావుండేదేమో అనిపించింది కూడా. అంతలోనే నేను మెట్రోలో ఓ ఫైల్ మర్చిపోయిన సంగతి గుర్తొచ్చింది. ఆ విషయం తెలిస్తే బాస్ క్లాస్ పీకుతారు. మెమో ఇచ్చినా ఇవ్వొచ్చు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఫోన్ మోగింది. గొంతు గుర్తుపట్టాను. అతనే. ‘మీ ఫైల్..’ అని సంభాషణ ప్రారంభించగానే పోయినప్రాణం తిరిగొచ్చింది. సాయంత్రం మళ్లీ స్టేషన్లో కలుసుకున్నాం. అప్పటి నుంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. అతనితో ప్రేమలో పడిపోతున్నానేమో అనే సందేహమూ కలుగుతున్నది. నా ఆలోచనలు సరైన దార్లోనే వెళ్తున్నాయా? – ఓ సోదరి
ట్రైన్లో నిద్రలేపినందుకు థ్యాంక్స్ చెప్పండి. పోయిందని అనుకున్న ఫైల్ చేతిలో పెట్టినందుకు పార్టీ ఇవ్వండి. అంతేకానీ, వెనకాముందూ చూడకుండా ప్రేమించేయడం ఏమిటి? మీ పరిచయం వయసు ఎంత? అతను ఏం చదువుకున్నాడు? అతని కుటుంబం ఏమిటి? కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా?.. ఒక్కసారి అతని గురించి ఎంక్వైరీ చేయండి. అతనిపై మీకున్న సదభిప్రాయానికి.. ఆ ఫలితాలు కూడా దగ్గరగా ఉంటే.. అడుగు ముందుకు వేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవర్నీ నమ్మలేం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

