గర్భిణిలు చింతకాయలను ఎందుకు తినాలంటే..?

మహిళలు గర్భం ధరించారంటే చాలు.. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. వారాలు గడుస్తున్న కొద్దీ తినే ఆహారంలో, తాగే నీరు, ఇతర ద్రవాల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భిణులు పుల్లగా ఉండే నిమ్మ, ఊరగాయ, ఇతర పండ్లను తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అలాంటి పండ్లలో చింతపండు కూడా ఒకటి. ఇది మనం సహజంగా తరచూ తినే పండ్ల మాదిరి పండు కాకపోయినా గర్భిణీలకు మాత్రం చింతపండు ఎంతో మేలు చేస్తుంది. మరి దాని వల్ల గర్భిణీలకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
చింతపండు లేదా చింతకాయల్లో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
చింతకాయల్లో ఉండే నియాసిన్ (విటమిన్ బి3) కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. బిడ్డ మెదడు, జీర్ణవ్యవస్థ, మ్యూకస్ తదితర అవయవాలు సరిగ్గా పెరిగేలా చేస్తుంది.
చింతకాయల్లో ఉండే డైటరీ ఫైబర్ మలబద్దకం రాకుండా చూస్తుంది. అధిక బరువు పెరగకుండా రక్షిస్తుంది.
చాలా మంది గర్భిణులకు ఉదయం నిద్ర లేవగానే వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి వారు చింతపండు లేదా కాయలను కొద్దిగా తింటే ఫలితం ఉంటుంది.
చింతకాయలను తినడం వల్ల శిశువు నెలలు నిండకుండా పుట్టే స్థితి రాకుండా ఉంటుంది. అలాగే తల్లులకు జెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా ఉంటుంది.
హైబీపీ సమస్య ఉండే గర్భిణులు చింతకాయలను తీసుకుంటే మంచిది. అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా చూసే ఔషధ గుణాలు కూడా చింతకాయల్లో ఉంటాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- eat
- pregnant-women
- tamarind
RELATED ARTICLES
తాజా వార్తలు
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

